రాజమౌళి-మహేష్ కాంబో: ఇదేం ట్విస్ట్

రాజమౌళి-మహేష్ బాబు కాంబో పై ఎలాంటి న్యూస్ వినిపించినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది. ఈ కాంబో పై ఎప్పుడు అప్ డేట్ ఇస్తారో అనే అతృతతో మహేష్ అభిమానులే కాదు ప్రపంచ వ్యాప్త రాజమౌళి అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఆగష్టు 9 న మహేష్ బర్త్ డే కే SSMB 29 ట్రీట్ అందుతుంది అనుకుంటే అది అవ్వలేదు. 

సెప్టెంబర్ లో ఈ కాంబో పై అసలు సిసలైన అప్ డేట్ ఇచ్చేలా రాజమౌళి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులతో పాటుగా కాన్సెప్ట్ వీడియో ని రెడీ చేసే పనిలో ఉన్నట్లుగా తెలుస్తుంది. మరోపక్క రాజమౌళి-మహేష్ కాంబో పై ఓ క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది. ఈ చిత్రానికి గరుడ అనే టైటిల్ రాజమౌళి అనుకుంటున్నారా అనేలా ఓ న్యూస్ హైలెట్ అయ్యింది. 

SSMB 29 విజువల్ డెవలప్మెంట్ ఆర్టిస్ట్ విజయన్ సోషల్ మీడియా హ్యాండిల్ లో గోల్డ్ కలర్ గద్ద రెక్కలను ఉంచి #SSMB29 #SSMB29Diaries అంటూ చేసిన పోస్ట్ స్ప్రెడ్ అవడం అటుంచి రాజమౌళి-మహేష్ కాంబో కి గరుడ అనే టైటిల్ ఎమన్నా పెడుతున్నారా అనే అనుమానం వచ్చేలా ఉండడంతో.. SSMB29 టైటిల్ గరుడ అయ్యుండొచ్చు అని ఊహించేసుకుంటున్నారు సినీ జనాలు. 

Visual Artist spill beans on SSMB29

Exciting revelations about SSMB29
ssmb29