Advertisementt

బాలయ్య కోసం పవర్ ఫుల్ విలన్

Wed 05th Jun 2024 10:16 AM
akhanda 2  బాలయ్య కోసం పవర్ ఫుల్ విలన్
Akhanda 2 villain confirmed బాలయ్య కోసం పవర్ ఫుల్ విలన్
Advertisement
Ads by CJ

నందమూరి బాలకృష్ణ ఈమధ్యన చాలా పవర్ ఫుల్ కేరెక్టర్స్ లో అభిమానులని సర్ ప్రైజ్ చేస్తున్నారు. అఖండ, వీర సింహ రెడ్డి, భగవంత్ కేసరి ఇలా ఆయన హ్యాట్రిక్ కొట్టిన సినమాలన్నిటిలో బాలయ్య పవర్ ఫుల్ లుక్స్, కేరెక్టర్స్ తో ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తున్నారు. అందుకు తగ్గ పవర్ ఫుల్ విలన్స్ ని తీసుకురావడంలో దర్శకులు కిందా మీదా పడుతున్నారు.

అఖండ లో బాలయ్య ముందు శ్రీకాంత్ విలన్ కేరెక్టర్ తేలిపోయింది. ఇక వీర సింహ రెడ్డి లోను బాలయ్య కేరెక్టర్ ముందు విలన్ కేరెక్టర్ చిన్నబోయింది. భగవంత్ కేసరిలోను అంతే. అందుకే ఇప్పుడు అఖండ 2 కోసం బోయపాటి పవర్ ఫుల్ విలన్ వేటలో ఉన్నాడట. ప్రస్తుతం NBK 109 లో దర్శకుడు బాబీ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ని తీసుకొచ్చారు.

ఇక బోయపాటి బాలయ్య కోసం ఎలాంటి విలన్ తెస్తారో అని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. బోయపాటి కూడా సంజయ్ దత్, బాబీ డియోల్ లాంటి స్టార్లను సంప్రదించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సంజయ్ దత్ కి బోయపాటి ఫోన్ లోనే విలన్ రోల్ చెప్పారని.. సంజయ్ దత్ కూడా బోయపాటి కథకి సానుకూలంగా స్పందించినట్టుగా తెలుస్తుంది. అంటే అఖండ 2 లో బాలయ్య కి విలన్ గా సంజయ్ దత్ రావడం పక్కా అనిపిస్తుంది. 

Akhanda 2 villain confirmed:

Interesting developments in Akhanda 2

Tags:   AKHANDA 2
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ