Advertisement

డబుల్ ఇస్మార్ట్ కి అదే బ్యాలెన్స్

Thu 04th Apr 2024 11:07 AM
double ismart  డబుల్ ఇస్మార్ట్ కి అదే బ్యాలెన్స్
Double iSmart shooting update డబుల్ ఇస్మార్ట్ కి అదే బ్యాలెన్స్
Advertisement

హీరో రామ్-పూరి జగన్నాథ్ కలయికలో ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న డబుల్ ఇస్మార్ట్ శంకర్ షూటింగ్ సైలెంట్ గా జరిగిపోతుంది. మహాశివరాత్రి రోజున రిలీజ్ అంటూ పూరి జగన్నాథ్ ఎప్పుడో ప్రకటించినా.. షూటింగ్ డిలే అవడంతో రిలీజ్ డేట్ మారిపోయింది. పోస్ట్ పోన్ అయితే చేసారు,  కొత్త డేట్ అనౌన్స్ చేసారు. రామ్ అప్పుడపుడు కనిపించినా ఈ మధ్యన డబుల్ ఇస్మార్ట్ అప్ డేట్ ఏమి బయటికి రావడం లేదు. 

ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ రెండు పాటలు అలాగే ఓ పదిరోజుల వర్క్ మినహా మిగతా షూటింగ్ మొత్తం పూర్తయినట్లుగా తెలుస్తోంది. అందులో ఇంటర్వెల్ ఫైట్, క్లయిమాక్స్ ఫైట్ బ్యాలెన్స్ తో పాటు రెండు పాటలతో సహా మినహా మిగిలిన సినిమా అంతా పూర్తి అయినట్లుగా తెలుస్తుంది. 

మరి అంతా పూర్తవుతున్నా పూరి జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్ అప్డేట్ పై మౌనం వహిస్తున్నారు, ప్రస్తుతం అయితే ఇస్మార్ట్ షూటింగ్ అప్ డేట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

Double iSmart shooting update :

Ram Double iSmart update 

Tags:   DOUBLE ISMART
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement