Advertisementt

ఆదికేశవ ఓటిటీ పార్ట్నర్ రివీల్డ్

Fri 24th Nov 2023 02:16 PM
aadikeshava  ఆదికేశవ ఓటిటీ పార్ట్నర్ రివీల్డ్
Aadikeshava OTT Partner Revealed ఆదికేశవ ఓటిటీ పార్ట్నర్ రివీల్డ్
Advertisement
Ads by CJ

మెగా హీరో వైష్ణవ తేజ్-బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రీలీల కలయికలో శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్ లో తెరకెక్కిన ఆదికేశవ ఈరోజు నవంబర్ 24 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డివోషనల్ టచ్‌తో రూపొందిన ఈ మూవీ ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నేడు విడుదలైన ఈ చిత్ర డిజిటల్ హక్కుల కోసం తీవ్ర పోటీ ఏర్పడింది. అందులో భాగంగానే ఆదికేశవ చిత్ర ఓటిటీ హక్కులని ఓ ప్రముఖ ఓటిటీ సంస్థ చేజిక్కించుకుంది.

ఈరోజు విడుదలైన ఆదికేశవ మూవీ టైటిల్స్ లోనే ఆ ఓటిటీ సంస్థ పేరుని రివీల్ చేసారు. ఆదికేశవ మూవీని నెట్ ఫ్లిక్స్ భారీ డీల్ తో చేజిక్కించుకుంది. సినిమాను థియేటర్లలో విడుదలైన 30 రోజుల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నెట్‌ఫ్లిక్స్ సంస్థతో నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారని తెలుస్తుంది. నవంబర్ 24వ తేదీన విడుదలైన ఆదికేశవ చిత్రం డిసెంబర్ చివరి వారంలో స్ట్రీమింగ్‌కు వస్తుందనే టాక్ వినిపిస్తోంది.

Aadikeshava OTT Partner Revealed:

Aadikeshava locks its OTT partner

Tags:   AADIKESHAVA
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ