Advertisement

ముంబైలో మొదలైన డబుల్ ఇస్మార్ట్

Wed 12th Jul 2023 04:35 PM
double ismart  ముంబైలో మొదలైన డబుల్ ఇస్మార్ట్
Double iSmart Regular Shoot Commences In Mumbai ముంబైలో మొదలైన డబుల్ ఇస్మార్ట్
Advertisement

ఉస్తాద్ రామ్ పోతినేని, సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ల  క్రేజీ ప్రాజెక్ట్ డబుల్ ఇస్మార్ట్‌ లో తన పాత్ర కోసం రామ్ మేకోవర్ అందరినీ ఆశ్చర్యపరిచింది. తన ట్రాన్స్ ఫర్మేషన్ చూపించే వీడియోలో సూపర్ స్మార్ట్ గా కనిపించారు రామ్. పూరీ కనెక్ట్స్‌ బ్యానర్ పై పూరీ జగన్నాధ్, ఛార్మి కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విషు రెడ్డి సీఈవో.

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈరోజు ముంబైలో ప్రారంభమైంది. భారీ సెట్‌ లో రామ్, ఫైటర్స్‌పై భారీ సీక్వెన్స్‌ తో టీమ్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించింది. ఇద్దరమ్మాయిలతో చిత్రం నుంచి పూరీ జగన్నాధ్ తో అసోసియేట్ అవుతున్న స్టంట్ డైరెక్టర్ కేచ ఈ సీక్వెన్స్ కి కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కోసం హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ జియాని జియానెల్లి పనిచేస్తున్నారు.

వర్కింగ్ స్టిల్‌లో రామ్, చేతిలో ఫైర్ వర్క్స్ పట్టుకుని ట్రక్కులో కూర్చొని కనిపించారు. పూరి, కేచ, జియానీలు కూడా చిరునవ్వుతో కనిపిస్తున్నారు.

డబుల్ ఇస్మార్ట్ సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలతో హై బడ్జెట్‌తో రూపొందుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో  తెలియజేస్తారు మేకర్స్.

Double iSmart Regular Shoot Commences In Mumbai :

Double iSmart Regular Shoot Commences In Mumbai With A Massive Action Sequence

Tags:   DOUBLE ISMART
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement