పుకార్లకు భలేగా చెక్ పెట్టిన పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఎక్కడ ఎదిగిపోతారో.. వారాహి యాత్రతో తన గ్రాఫ్ ఎక్కడ పెంచేసుకుని రాజకీయాల్లో చక్రం తిప్పుతారో అని వైసీపీ బ్యాచ్ తెగ భయపడిపడిపోయి ఆయనపై అవాకులు చవాకులు పేలుతుంది. సీఎం జగన్ అయితే పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్నే టార్గెట్ చేసి అవమానిస్తారు. ఇక వైసీపీ మంత్రులు కూడా సినిమా నటుడు, ముగ్గురు భార్యలంటూ ఎద్దేవా చేస్తారు. వైసీపీ అనుకూల మీడియా మరో అడుగు ముందుకేసి పనిగట్టుకుని పవన్ కళ్యాణ్ మూడో భర్యకి విడాకులిప్పించేసారు. పవన్ కళ్యాణ్ తన మూడో భార్యతో విడిపోయాడంటూ పుకార్లకు తెర లేపారు. నేషనల్ మీడియా నుండి బ్లూ మీడియా వరకు అదే కూతలు, అవే రాతలు.
పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లేజ్నోవా ఈమధ్యన మెగా ఫ్యామిలీ ఫంక్షన్స్ లో కానరావడం లేదు, పవన్ కళ్యాణ్ పక్కన కనిపించడం లేదు.. అంటే అన్నాకి కూడా పవన్ కళ్యాణ్ విడాకులిచ్చేసి ఉంటాడనే పుకారుని ప్రచారం చేసాయి. పాపం పవన్ కళ్యాణ్ తో అన్నకి విడాకులిప్పించేసిన బ్లూ మీడియాకి, నేషనల్ మీడియాకి పవన్ కళ్యాణ్ పగిలిపోయే పంచ్ వేశారు. పవన్ తన భార్య అన్నా లేజ్నోవాతో కలిసి పూజలో పాల్గొన్న పిక్ వదిలింది జనసేన పార్టీ.
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీమతి అన్నా కొణిదెల గారు - వారాహి విజయ యాత్ర తొలి దశ దిగ్విజయంగా పూర్తి చేసుకొన్న సందర్భంగా హైదరాబాద్ లోని తమ నివాసంలో నిర్వహించిన పూజాదికాలలో పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా చేపట్టిన ఈ ధార్మిక విధులను శ్రీ పవన్ కళ్యాణ్, శ్రీమతి అన్నా కొణిదెల దంపతులు నిర్వర్తించారు. కొద్ది రోజుల్లో వారాహి విజయ యాత్ర తదుపరి దశ మొదలవుతుంది. ఇందుకు సంబంధించిన సన్నాహక సమావేశాల్లో పాల్గొనేందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు త్వరలో మంగళగిరి చేరుకుంటారు.. అంటూ ట్వీట్ చెయ్యడంతో నేషనల్ మీడియాకి, బ్లూ మీడియా కి ఫ్యూజులు ఎగిరిపోయాయి. మరి అంతలా విడాకుల మేటర్ ని ప్రచారం చేసాయాయే..
Pawan Kalyan, wife Anna Lezhneva new pic puts an end to their separation rumours
Pawan Kalyan put a check on the rumours






































