Advertisement

ఎన్టీఆర్ వీక్-చరణ్ పీక్స్

Sun 19th Mar 2023 10:34 AM
jr ntr,-ram charan  ఎన్టీఆర్ వీక్-చరణ్ పీక్స్
NTR Week-Charan Peaks ఎన్టీఆర్ వీక్-చరణ్ పీక్స్
Advertisement

యంగ్ టైగర్ ఎన్టీఆర్-మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ ఆర్.ఆర్.ఆర్ విజయాన్ని ఎంజాయ్ చేస్తూనే ఆస్కార్ కోసం అమెరికా వెళ్లారు. అక్కడ రామ్ చరణ్ సోలో గా HCA అవార్డులను అందుకుని హైలెట్ అవ్వగా.. ఎన్టీఆర్ పర్సనల్ రీజన్స్ తో HCA అవార్డ్స్ కి హాజరు కాలేకపోయాడు. అయితే రామ్ చరణ్ ఈ జనవరి నుండి తన ప్రతి ఒక్క కదలికని మీడియాలో హైలెట్ అయ్యేలా స్పెషల్ పీఆర్ టీమ్ ని మెయింటింగ్ చేస్తూ వస్తున్నాడు. రామ్ చరణ్ అమెరికాలో ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, అక్కడ ఏయే డ్రెస్సులను వాడాడు. మీడియాలో ఏం మాట్లాడాడు అనేది ఆయన పీఆర్ టీం పర్ఫెక్ట్ గా ప్రజలకి అందించేలా ప్లాన్ చేసుకున్నాడు. 

ఆస్కార్ విషయంలోనూ రామ్ చరణ్ అదే ఫాలో అయ్యాడు. ఆయన ఆస్కార్ వేడుకకి హాజరైంది మొదలు.. ఢిల్లీ నుండి హైదరాబాద్ కి వచ్చేవరకు మీడియాలో చరణ్ పేరు మోగుతూనే ఉండడానికి కారణం ఆయన పీఆర్ టీమ్.

కానీ ఎన్టీఆర్ విషయంలో అలా జరగలేదు. ఎన్టీఆర్ కూడా చరణ్ లానే ఓ స్పెషల్ పీఆర్ టీమ్ ని మెయింటింగ్ చేస్తే బావుండేది అనేది ఎన్టీఆర్ ఫాన్స్ అభిప్రాయం. అసలే తారకరత్న మరణంతో అమెరికాకి వెళ్లలేకపోయిన ఎన్టీఆర్ కి మీడియాలో ఎక్కడా హైలెట్ అవ్వలేదు అనుకుని ఫాన్స్ ఇప్పటికే చాలా ఫీలవుతున్నారు. ఆస్కార్ వేడుకల్లో బెస్ట్ డ్రెస్సెడ్ విభాగంలో హాలీవుడ్ స్టార్స్ ని వెనక్కి నెట్టి ఫస్ట్ ప్లేస్ లో ఉండడం, అలాగే ఆస్కార్ వేడుక రోజున 24 గంటల్లో ట్రెండ్ అయిన స్టార్స్ లిస్ట్ లో ఎన్టీఆర్ మొదటి స్థానంలో ఉండడం ఇవన్నీ మీడియాలో అంతగా హైలెట్ అవ్వలేదు అనేది ఫాన్స్ అభిప్రాయం. 

అమెరికా నుండి హైదరాబాద్ కి ఎన్టీఆర్ డైరెక్ట్ గా వచ్చెయ్యడమే కాకుండా అది తెల్లవారు ఝామున కావడంతో కొంతమంది అభిమానులు ఆయన కోసం రాలేకపోయారు అంటున్నారు. అదే గనక ఎన్టీఆర్ కూడా స్పెషల్ పీఆర్ టీమ్ ని మెయింటింగ్ చేసినట్లయితే.. తెలుగులో పదే పదే ఎన్టీఆర్ ట్రెండ్ అయ్యి మీడియాలో హైలెట్ అయ్యేవాడు.. 

ఆర్.ఆర్.ఆర్ సక్సెస్ ఎలా ఉన్నా.. ఇలా హైలెట్ అయ్యే విషయంలో రామ్ చరణ్ పీక్స్ లో ఉంటే.. ఎన్టీఆర్ వీక్ అయ్యాడనే అభిప్రాయాలు నెటిజెన్స్ కూడా వ్యక్తం చేస్తున్నారు. 

NTR Week-Charan Peaks:

Jr NTR Week-Ram Charan Peaks

Tags:   JR NTR, -RAM CHARAN
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement