Advertisement

డేటింగ్ రూమర్స్ పై తమన్నా ఫైర్

Mon 13th Mar 2023 04:26 PM
tamannaah bhatia,vijay varma  డేటింగ్ రూమర్స్ పై తమన్నా ఫైర్
Tamannaah fires on dating rumours డేటింగ్ రూమర్స్ పై తమన్నా ఫైర్
Advertisement

గత కొద్దిరోజులుగా మిల్కి బ్యూటీ తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో సీక్రెట్ డేటింగ్ లో ఉంది, అది న్యూ ఇయర్ రోజున గోవాలో జరిగిన పార్టీతోనే తేలిపోయింది, తర్వాత వీరిద్దరూ ముంబై ఎయిర్ పోర్ట్ లో కలిసి కనిపించి ఆ రూమర్స్ ని నిజం చేసారు అంటూ తమన్నా డేటింగ్ పై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అంతేకాకుండా ఈ ఫిబ్రవరిలోనే తమన్నా-విజయ్ వర్మల న్సిచ్చితార్ధం, పెద్దల అంగీకారంతో ఈ జంట పెళ్లి పీటలెక్కుతుంది అంటూ ఇలా రకరకాల గాసిప్స్ కూడా వినిపించాయి. కానీ తమన్నాకి ఎంగేజ్మెంట్ అయిన దాఖలాలు కనిపించలేదు.

తాజాగా తమన్నా తన డేటింగ్ రూమర్స్ పై ఫైర్ అయ్యింది. నేనూ విజయ్ వర్మ కలిసి ఒక సినిమా చేసాము, దానితో మాకు పెళ్లి చేసేస్తారా.. మేమిద్దరం కలిసి నటించినప్పటినుండి ఇలాంటి వార్తలు వస్తూనే ఉన్నాయి. అన్ని విషయాలపై స్పందించాలా.. అందుకే కామ్ గా ఉండిపోయాను. అయినా హీరోయిన్స్ పై ఇలాంటి గాసిప్స్ ఎందుకు తెర మీదకి వస్తున్నాయో అర్ధం కావడం లేదు. అన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. 

డాక్టర్ నుండి వ్యాపారవేత్త వరకు నా పెళ్లిని ఇప్పటికి చాలాసార్లు చేసారు.. అంటూ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తమన్నా కాస్త వెతకరంగానే తన డేటింగ్ రూమర్లు కి చెక్ పెట్టింది. ఇకపోతే తమన్నా మెగాస్టార్ చిరుతో భోళా శంకర్, సూపర్ స్టార్ రజినీతో జైలర్ మూవీస్ చేస్తుంది.

Tamannaah fires on dating rumours:

Tamannaah Bhatia on dating rumours with Vijay Varma

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement