Advertisement

ఉపాసన ప్రెగ్నెంట్ మంత్ రివీల్ చేసిన చరణ్

Mon 13th Mar 2023 01:46 PM
ram charan,upasana  ఉపాసన ప్రెగ్నెంట్ మంత్ రివీల్ చేసిన చరణ్
Ram Charan reveals Upsana pregnancy month ఉపాసన ప్రెగ్నెంట్ మంత్ రివీల్ చేసిన చరణ్
Advertisement

మెగా కోడలు, రామ్ చరణ్ వైఫ్ ప్రెగ్నెంట్ అన్నప్పటినుండి మెగా ఫ్యామిలీనే కాదు.. మెగా ఫాన్స్ కూడా సంబరాల్లో మునిగిపోయారు. ఎప్పుడెప్పుడు మెగా వారసుడిని చూస్తామా అన్నట్టుగా ఉన్నారు వారు. చిరు-సురేఖలైతే ఉబ్బితబ్బిబ్బైపోతున్నారు. రామ్ చరణ్ ఈ ఆనందకర విషయాన్ని టాలీవుడ్ నుండి హాలివుడ్ మీడియా వరకు పంచుకుంటున్నాడు. రామ్ చరణ్ ఆస్కార్ కోసం అమెరికా వెళ్లిన కొద్దిరోజులకే ఉపాసన కూడా అమెరికా వెళ్ళింది. అక్కడ భర్త తో షాపింగ్, విహార యాత్రలు చేపట్టిన ఉపాసన తాజాగా భర్త చరణ్ తో కలిసి ఆస్కార్ అవార్డులకు హాజరైంది.

అయితే రామ్ చరణ్ ఆస్కార్ రెడ్ కార్పెట్ మీద నడిచే ముందు హాలీవుడ్ మీడియాతో ఉపాసన ప్రెగ్నెన్సీ విషయాలను పంచుకున్నాడు. గోల్డెన్ గ్లోబ్స్ నుంచి అకాడమీ అవార్డ్స్ వరకు సాగిన ఈ జర్నీకి తమకు పుట్టబోయే బిడ్డ అదృష్టాన్ని తెచ్చిపెట్టినట్లుగా భావిస్తున్నామని, తన భార్య ఉపాసనకు 6 నెల అంటూ రామ్ చరణ్ ఉపాసన ప్రెగ్నెన్సీ మంత్ రివీల్ చేసాడు. ఉపాసన ప్రెగ్నెంట్ అని తెలిసిన క్షణం నుండి ఆమె బేబీ బంప్ ఫొటోస్ కోసం మీడియా సకల ప్రయత్నాలు చేస్తుంది. ఇక ఉపాసన ఆస్కార్ వేడుకల్లో పాల్గొనేందుకు తెలుగుదనం ఉట్టిపడేలా చీర కట్టులో సింపుల్ గా కనిపించగా.. తాను రామ్ చరణ్ ని ఎప్పుడూ సపోర్ట్ చేస్తాను.

ఆర్ ఆర్ ఆర్ ఫ్యామిలిలో భాగమైనందుకు తాను చాలా సంతోషంగా ఉన్నానని, కొద్దిగా ఆందోళనగా ఉన్నా.. ఈ సమయంలో ఇక్కడ ఉన్నందుకు ఆనందపడుతున్నట్లుగా ఉపాసన మీడియాకి చెప్పింది. మరి ఉపాసనకు ఇప్పుడు ఆరో నెల అంటే మరో మూడు, నాలుగు నెలలో చరణ్ దంపతులు తల్లితండ్రులు అయ్యే మధుర క్షణాలను ఆస్వాదిస్తారన్నమాట.

Ram Charan reveals Upsana pregnancy month:

Upasana pregnancy month revealed

Tags:   RAM CHARAN, UPASANA
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement