యువనటికి పోకిరి వేధింపులు

గత రాత్రి హైదరాబాద్ లోని ప్రముఖ ఏరియా KBR  పార్క్ లో ఓ యువనటిని  వేధించిన ఆగంతుకుడు శేఖర్ పోలీస్ లకి చిక్కాడు. రాత్రి ఏడు గంటల సమయంలో వాకింగ్ కోసమని వచ్చిన ఆ నటిని ఫాలో అవడంతో ఆమె కొద్దిగా భయపడి ఆగి వెనక్కి చూడగా ఆ వ్యక్తి కూడా ఆగి మళ్ళీ ఆమె నడవగానే.. అతను నడక మొదలు పెట్టడం, ఇలా నాలుగైదు సార్లు జరగడంతో ఆ నటి తనని ఓ వ్యక్తి వెంబడిస్తున్నాడంటూ పక్కవారికి చెప్పడంతో వారు పార్క్ సిబ్బందికి సమాచారం అందించారని తెలుస్తుంది.

ఆ వెంటనే పార్క్ సిబ్బంది ఆ వ్యక్తిని పట్టుకుని పోలీస్ లకి అప్పజెప్పడంతో.. పోలీస్ లు పట్టుకున్న ఆగంతుకుడిని శేఖర్ గా గుర్తించారు. గత రాత్రి KBR పార్క్ కి వాకింగ్ కి వచ్చిన ఆ నటి కొండాపూర్ బొటానికల్ గార్డెన్స్ సమీపంలో నివసిస్తుంది, ఆమె తరుచూ ఇలా KBR పార్క్ కి వస్తూ వాకింగ్ చేస్తూ ఉండడం అతను గమనించి ఇలా వెంటపడినట్లుగా పోలీస్ లు చెబుతున్నారు.

Young actress harassed by hooligans

Young actress harassed by pokiri
young actress