తారకరత్న భౌతిక కాయం వద్ద NTR-ప్రణతి

నందమూరి యువ హీరో తారకరత్న మరణాన్ని నందమూరి ఫ్యామిలీ జీర్ణించుకోలేకపోతోంది. ముఖ్యగా ఆయన భార్య భర్త మరణంతో తీరని శోకంతో మానసిక సంఘర్షణకి గురవ్వడంతో ఆమె అస్వస్థతకి లోనైంది. తారకరత్న భౌతిక కాయాన్ని హైదరాబాద్ తరలించినప్పటినుండి నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు, ప్రముఖులు తారకరత్న కడసారి చూపు కోసం తరలి వచ్చారు. తారకరత్న అలా నిర్జీవంగా పడి ఉండడాన్ని చూసిన ఆయన తల్లితండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. తారకరత్న పెద్ద బిడ్డ తండ్రి లేడన్న చేదు నిజాన్ని జీర్ణించుకోలేక వెక్కిళ్లు పెడుతుంది. నిన్న ఆదివారం ఉదయమే ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్ లు సోదరుడి భౌతిక కాయం దగ్గర కన్నీళ్లు పెట్టుకుని.. ఫ్యామిలీని ఓదార్చి వచ్చారు.
నేడు సోమవారం తారకరత్న భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులు ఫిల్మ్ ఛాంబర్ కి తరలించారు. అభిమానులు, ప్రముఖుల సందర్శనార్ధం.. ఫిలిం ఛాంబర్ లో ఈ రోజు మూడు గంటలవరకు ఉంచాలని కుటుంబం నిర్ణయించింది. అన్న కొడుకు తారకరత్న ఇక లేడన్న నిజాన్ని బాలయ్య మొయ్యలేకపోతున్నారు. తారకరత్న భౌతిక కాయం దగ్గర బావురుమంటున్న దృశ్యాలు ఛానల్స్ లో కనిపించడంతో అభిమానులు కంటతడి పెడుతున్నారు. ఇక ఫిల్మ్ ఛాంబర్ వద్ద తారకరత్న భౌతిక కాయం దగ్గర బాలయ్య, విజయ్ సాయి రెడ్డిలతో పాటుగా నందమూరి కుటుంబం మొత్తం ఉంది. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు అలాగే ఎన్టీఆర్ భార్య ప్రణతి, కళ్యాణ్ రామ్ తల్లి అందరూ తారకరత్న కడసారి వీడ్కోలుకి ఛాంబర్ వద్దకి చేరుకున్నారు.
ప్రస్తుతం ఫిల్మ్ ఛాంబర్ వద్ద అభిమానుల కోలాహలం కనబడుతుంది. సినీ రాజకీయ ప్రముఖులు తారకరత్న చివరి చూపు కోసం క్యూ కట్టారు. ఈరోజు మూడు గంటల తర్వాత తారకరత్న అంతిమ యాత్ర మొదలు పెట్టి ఐదు గంటలకి మహా ప్రస్థానంలో అంత్యక్రియలకు నందమూరి కుటుంబం ఏర్పాట్లు చేస్తుంది.
NTR and Kalyan Ram pay last respects to Taraka Ratna at FIlm Chamber
Jr NTR, Kalyanram get emotional at Taraka Ratna







































