మరింత బలంగా సమంత

More strongly SamanthaMore strongly Samantha

అనారోగ్యంతో గత ఆరు నెలలుగా.. తనకిష్టమైన జిమ్ కి సోషల్ మీడియాకి దూరంగా ఉంటున్న సమంత మళ్ళీ సాధారణ జీవితంలోకి వచ్చేసింది. సినిమాలు, షూటింగ్స్, జిమ్ లో వర్కౌట్స్ అంటూ హడావిడి మొదలు పెట్టేసింది. సోషల్ మీడియాలో కూడా రోజుకో పోస్ట్ తో అభిమానులకి దగ్గరైపోయింది. అటు బాలీవుడ్ వెబ్ సీరీస్ సిటాడెల్ కోసం ముంబైకి వెళ్ళింది. ఇప్పుడు విజయ్ దేవరకొండ తో ఖుషి షూటింగ్ కి రెడీ అయ్యింది. అంతేకాకుండా రోజుకో జిమ్ వీడియో విడుదలవుతుంది.

మాయోసైటిస్ వ్యాధి సమంతని ఎంతగా బాధపెట్టినా.. జిమ్ చెయ్యకపోయినా.. చికిత్స తీసుకుంటూనే రెస్ట్ తీసుకుని.. ధైర్యంతో ఆ వ్యాధిని ఎదుర్కొని.. మళ్ళీ పబ్లిక్ లోకి వచ్చేసింది. తాజాగా జిమ్ వీడియోని ఇన్స్టా లో ఓ వీడియో షేర్ చేసింది. ఆ వీడియోతో పాటుగా 2023 సంవత్సరంలో మనం బలంగా మారాలి. ప్రస్తుతం సరదాగా అనిపిస్తోంది. ఇది నిజం కాదనుకుంటున్నారా.. మీరు కూడా దీన్ని ట్రై చేస్తారా అంటూ సమంత క్యాప్షన్ పెట్టింది. ప్రస్తుతం సమంత క్యాప్షన్ పెట్టిన జిమ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Samantha shares latest Gym video

samantha