ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Kiara Reception: Trolls on Kiara Dress

కియారా రిసెప్షన్: డ్రెస్ పై ట్రోల్స్

Kiara Reception: Trolls on Kiara DressKiara Reception: Trolls on Kiara Dress

బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ ఈ నెల 7 న రాజస్థాన్ లోని సూర్యఘాట్ కోటలో హీరో సిద్దార్థ్ తో ఏడడుగులు నడిచి మూడు ముళ్ళు వేయించుకుంది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్ళికి బాలీవుడ్ నుండి కరణ్ జోహార్, షాహిద్ కపూర్ జంట హాజరయ్యింది. ఇక కియారా అద్వానీ పెళ్ళిలో లేత గులాబీ రంగు లెహంగాతో పెళ్లి కూతురులా మెరిసిపోగా సిద్దార్థ్ మల్హోత్రా లైట్ కలర్ డ్రెస్ లో మెరిశాడు. పెళ్లి తర్వాత వెంటనే ముంబై వచ్చిన ఈ కొత్త జంట తర్వాత ఢిల్లీ వెళ్లి వచ్చింది. అత్తారింట్లో కియారకి అపూర్వ స్వాగతం దొరికిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

అయితే కియారా అద్వానీ-సిద్దార్థ్ మల్హోత్రాలు నిన్న ఆదివారం ముంబై లో సెలబ్రిటీస్ కి సన్నిహితులకు గ్రాండ్ గా రిసెప్షన్ ఇచ్చారు. కియారా ఈ రిసెప్షన్ లో ఏ డిజైనర్ సారీనో, లక్షల విలువ చేసే డిజైనర్ డ్రెస్ వేసుకుంటుంది అని అందరూ ఊహించారు. కానీ కియారా అద్వానీ ఏదో అవార్డు ఫంక్షన్స్ కి, సినిమా ప్రమోషన్స్ కి హాజరైనట్టుగా తన రిసెప్షన్ లో వేసుకున్న డ్రెస్ చూస్తే అనిపించేలా ఉంది అంటూ ఆమె వేసుకున్న డ్రెస్ పై కామెంట్స్ వినిపిస్తున్నాయి. హీరోయిన్స్ అంటే అంతే అనుకోవడానికి లేదు. వారు పెళ్ళిలో సాంప్రదాయంగా ఎలా ఉండాలో అలానే ఉంటారు. కానీ ఇక్కడ కియారా మాత్రం తన వెడ్డింగ్ రిసెప్షన్ లో ధరించిన డ్రెస్ నెటిజెన్స్ కి, ఆమె ఫాన్స్ కి నచ్చలేదు. కొంతమంది కియారా నీకు డ్రెస్ సెన్స్ తెలియదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అవార్డు వేడుకలకి ఎక్స్ పోజ్ చేసినట్టుగా.. అడ్రెస్స్ ఏమిటి.. నువ్వేమిటి అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇక కియారా డ్రెస్ పక్కనబెడితే.. ఈ రిసెప్షన్ కి అలియా భట్, విక్కీ కౌశల్, కరీనా కపూర్, రాశి ఖన్నా, వరుణ్ ధావన్, కరణ్, నీతూ కపూర్, విద్యా బాలన్, కాజోల్, అజయ్ దేవగన్.. లాంటి సెలెబ్రిటీస్ హాజరై కొత్త జంట ఇచ్చిన విందుని ఆరగించి ఫోటోలకు ఫోజులిచ్చారు.

Sid-Kiara Reception highlights

sid-kiara reception
kiara advani