ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Nidhhi Agerwal special appearance on Unstoppable

NBK-PSPK ఎపిసోడ్ లో నిధి మెరుపులు

Nidhhi Agerwal special appearance on Unstoppable Nidhhi Agerwal special appearance on Unstoppable

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాల్గొన్న విషయం తెలిసిందే. NBK-PSPK అన్ స్టాపబుల్ ఎపిసోడ్ ఈరోజు రాత్రి తొమ్మిదిగంటల నుండి స్ట్రీమింగ్ అవ్వబోతుంది. ఈ ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ తో పాటుగా ఆయన మేనల్లుడు సాయి తేజ్ కూడా కనిపించబోతున్నాడు. ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా చేస్తున్న పవన్ కళ్యాణ్ తో పాటు ఆ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న నిధి అగర్వాల్ కూడా ఈ షో లో మెరిసింది. 

NBK-PSPK ఎపిసోడ్ మధ్య లో వీడియో కాల్ లో పవన్ కళ్యాణ్, బాలకృష్ణ లతో నిధి అగర్వాల్ ముచ్చటించింది.. ఆ చిత్ర విశేషాలతో పాటు మరికొన్ని ఆసక్తికరమైన అంశాలు ఆమె ఈ షో ద్వారా పంచుకుంది.

Nidhhi Agerwal special appearance on NBK-PSPK Unstoppable episode

nidhhi agerwal
unstoppable