ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bigg boss 6:Two contestants in danger zone

బిగ్ బాస్ 6: టాప్ కంటెస్టెంట్స్ డేంజర్ జోన్ లో

బిగ్ బాస్ సీజన్ 6 లో రకరకాల మార్పులు జరుగుతున్నాయి. పెద్దగా ఫేమ్ లేని కంటెస్టెంట్స్ రంగంలో కనబడుతున్నారు. ఈ వారం BB హౌస్ లో బిగ్ బాస్ బర్త్ డే సెలెబ్రేషన్స్ ని హౌస్ మేట్స్ గ్రాండ్ గా ఇర్వహించారు. అదలా ఉంటే గత నాలుగు వారాలుగా నలుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. అందులో షాని, అభినయ ఒకే వారం డబుల్ ఎలిమినేషన్ అవ్వగా.. తర్వాత వారం నేహా, గత వారం ఆరోహి ఎలిమినేట్ అయ్యారు. ఇక ఈ వారం నామినేషన్స్ లో పెద్ద రచ్చ జరగలేదు. కూల్ గానే నామినేషన్స్ ప్రక్రియ ముగిసిపోయింది.

ఈ వారం ఇనాయ, ఫైమా, వాసంతి, చంటి, బాలాదిత్య, ఆదిరెడ్డి, మరీనా, అర్జున్ లు ఉండగా ఇనాయ మొదటి స్థానంలో ఓటింగ్ పరంగా కొనసాగుతుండగా.. రెండో స్థానంలో ఫైమా, మూడో స్థానంలో మరీనా ఉన్నారు. తర్వాత స్థానాల్లో అర్జున్, ఆదిరెడ్డి ఉన్నారు. ఆరోస్థానంలో వాసంతి తర్వాత స్థానాల్లో చంటి, బాలాదిత్యలు కొనసాగుతుండగా.. ఈవారం చంటి-బాలాదిత్యలు డేంజర్ జోన్ లో తక్కువ ఓట్స్ తో కనిపించడం చూస్తే ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. టాప్ కంటెస్టెంట్స్ గా బాలాదిత్య-చంటి ఉన్నప్పటికి వారి ఆట పరంగా వారికి ఓట్స్ పెద్దగా పడడడం లేదని తెలుస్తుంది. ఇలా అయితే ఈవారం ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు వెళ్లాల్సిందే. 

Chanti and Baladithya in danger zone

Bigg boss 6:Two contestants in danger zone
bigg boss 6
big boss
chanti