బాలయ్య-పవన్ కలిస్తే.. ఆ కిక్కే వేరప్పా
Pawan Kalyan and Trivikram Srinivas to start Balakrishna Unstoppable 2క్రేజీ స్టార్స్ ఎప్పడికైనా ఒకసారి కలిస్తే ఫాన్స్ కి వచ్చే కిక్ మాములుగా ఉండదు. అందులో రేర్ కాంబినేషన్స్ కలిసి కనబడితే.. అది మరింత జోష్ గా మారుతుంది. అలాంటి వాటిలో బాలకృష్ణ-నాగార్జున, బాలకృష్ణ-జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ-పవన్ కళ్యాణ్, బాలకృష్ణ-చిరంజీవి ఈ జోడీలు ఎక్కడైనా ఎప్పుడైనా కలిసి కనబడితే అభిమానులకి పూనకాలే. ప్రస్తుతం ఇలాంటి రేర్ ఫీట్ ఒకటి జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. అదే బాలకృష్ణ-పవన్ కళ్యాణ్ కలిసి ఒకే స్టేజ్ పై ఫాన్స్ కి ట్రీట్ ఇవ్వబోతున్నారని అంటున్నారు. అది ఎక్కడంటే ఆహా అన్ స్టాపబుల్ స్టేజ్ పై.
పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ లు బాలయ్య అన్ స్టాపబుల్ కి గెస్ట్ లుగా తీసుకురాబోతున్నారట అల్లు అరవింద్. ఇలాంటి కలయిక చూడడానికి వెయ్యి కళ్ళతో అభిమానులు వేచి చూస్తుంటే.. ప్రేక్షకులకి కన్నుల పండగే. మరి బాలయ్య-పవన్ కలిసి టాక్ షో లో పాల్గొంటే.. పవన్ వ్యక్తిగత విషయాలు, పొలిటికల్ మాటలు, సినిమాలకు సంబందించిన ప్రశ్నలని బాలయ్య సంధిస్తే.. ఆ కిక్ మరింతగా పెరగడం ఖాయం. అయితే పవన్ కళ్యాణ్ అసలు బాలయ్య షోకి రావడం సాధ్యమేనా అని చాలామందిలో అనుమానాలు ఉన్నప్పటికీ.. అల్లు కాంపౌండ్ లోకి బాలయ్య రాలేదా? అలాగే బాలయ్య షోకి పవన్ కళ్యాణ్ వస్తారు అంటున్నారు కొందరు. మరి ఈ కలయిక కోసం ఫాన్స్ మాత్రమే కాదు.. సాధారణ ప్రేక్షకుడు కూడా వెయిటింగ్..
Balakrishna Unstoppable 2 to kickstart with Pawan Kalyan and Trivikram Srinivas







































