ఆగష్టు లోనే సలార్ ట్రీట్

Salaar teaser updateSalaar teaser update

గత ఏడాది ఆగిన సలార్ షూటింగ్ ఈ ఏడాది మే లో మళ్ళీ మొదలయ్యింది. ఫస్ట్ షెడ్యూల్ తర్వాత భారీ అంటే ఏడాది గ్యాప్ తర్వాత ఫ్రెష్ గా సలార్ షూటింగ్ ని స్టార్ట్ చేసారు ప్రశాంత్ నీల్ - ప్రభాస్ లు. ఈలోపు ప్రభాస్ రాధేశ్యామ్, ప్రశాంత్ నీల్ కెజిఫ్ 2 పనులు చూసుకున్నారు. రాధే శ్యామ్ ప్రభాస్ కి నిరాశ మిగల్చగా.. ప్రశాంత్ నీల్ కి కెజిఎఫ్ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది. అయితే మే లో సలార్ షూటింగ్ మొదలయినప్పటినుండి ప్రభాస్ ఫాన్స్ సలార్ టీజర్ కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ మేకర్స్ మాత్రం టీజర్ విషయం చెప్పకుండా దాటేస్తున్నారు.

మధ్యలో ప్రభాస్ బర్త్ డే అంటే అక్టోబర్ వరకు సలార్ నుండి ఎలాంటి అప్ డేట్ లేదన్నారు..కానీ ఇప్పుడు ప్రభాస్ ఫాన్స్ కోసం సలార్ టీజర్ రెడీ అవుతుంది అనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మాస్ కటౌట్ ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఫాన్స్ ఎంతో ఆతృతగా ఉన్న టైం లో ఇదిగో సలార్ టీజర్, అదిగో సలార్ టీజర్ అంటే ఫాన్స్ ఆగుతారా.. అస్సలూరుకోరు. సోషల్ మీడియాలో హంగామా చేస్తారు. ఇక ఇప్పుడు ఆగస్టు లో సలార్ టీజర్ రిలీజ్ చేసే అవకాశం ఉంది అంటూ వస్తున్న వార్తలతో ఫాన్స్ ఖుషి అవుతున్నారు. ఇప్పటికే ప్రభాస్ మాస్ కటౌట్ లీకెడ్ పిక్స్ సోషల్ మీడియాని ఊపెయ్యగా.. ఇప్పుడు సలార్ టీజర్ రిలీజ్ చేస్తే ఫాన్స్ సత్తా చూపించేందుకు రెడీగా ఉన్నారు.

Salaar teaser August?

salaar
salaar teaser
prabhas
prashanth neel