ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Mega Star Chiranjeevi Presents Aamir Khan Laal Singh Chadda In Tollywood

ఫస్ట్ టైమ్ మెగాస్టార్ చిరు ఆ పని చేస్తున్నారు

ఇన్నేళ్ల సినీ ప్రస్థానంలో ఇప్పటి వరకు చిరు చేయని ఓ పనిని ఇప్పుడు చేస్తున్నారు. అదీ కూడా ఓ బాలీవుడ్ హీరో కోసం. మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ హీరోగా నటించిన చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’. టాలీవుడ్ హీరో నాగచైతన్య ఓ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాని మెగాస్టార్ చిరంజీవి కోసం చిరు ఇంట్లో ఆమిర్ ప్రత్యేక ప్రీమియర్‌ని ఏర్పాటు చేశారు. చిరంజీవి, ఆమిర్ ఖాన్‌లతో పాటు రాజమౌళి, సుకుమార్, నాగార్జున, నాగచైతన్య వంటి వారు కూడా ఈ ప్రీమియర్ షో‌లో భాగమయ్యారు. ఈ షో అనంతరం.. ఆమిర్ ఖాన్‌పై చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు. ఆమిర్ నటనకు మెగాస్టార్ మురిసిపోయారు. ఈ సినిమాని తెలుగులో కూడా విడుదల చేయాలని ఆమిర్‌ని చిరంజీవి కోరారు. అందుకు అంగీకరించిన ఆమిర్.. తెలుగులో ఈ సినిమాని మీరే సమర్పించాలని కోరారు. ఆమిర్ ఖాన్ మాట కాదనలేక.. ఫస్ట్ టైమ్ చిరంజీవి ఓ సినిమాని సమర్పిస్తున్నారు. చిరంజీవి ఈ సినిమాని సమర్పిస్తున్నట్లుగా ఓ పోస్టర్ కూడా ఆయన స్వయంగా ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు.

 

తొలిసారి మెగాస్టార్ ఇలా ఓ చిత్రాన్ని సమర్పిస్తుండటంతో.. టాలీవుడ్ అంతా ఈ సినిమా గురించే చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో ఉన్న విషయం చిరంజీవిని అంతగా మెప్పించింది కాబట్టే.. ఆయన ఈ చిత్రానికి ఏదో విధంగా భాగం కావాలని కోరుకున్నారని, అందులో భాగంగానే తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారని అంతా అనుకుంటున్నారు. ఇదో మంచి శుభ పరిణామంగా కూడా అంతా భావిస్తున్నారు. ఇండియన్ యాక్టర్స్ మధ్య ఇటువంటి బాండింగ్ ఉండటం అనేది ఆహ్వానించదగిందని.. చిరు, ఆమిర్‌ల బాండింగ్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ చిత్రాన్ని చిరంజీవి సమర్పణలో వయోకామ్ 18 స్టూడియోస్, ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై ఆమిర్ ఖాన్, కిరణ్ రావు, జ్యోతి‌దేశ్ పాండే, అజిత్ అంథారే నిర్మిస్తున్నారు. అద్వైత్ చందన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్ట్ 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. 

Mega Star shares his Laal Singh Chadda experience

Mega Star Chiranjeevi Presents Aamir Khan Laal Singh Chadda In Tollywood
chiranjeevi
aamir khan
laal singh chadda
presentation
tollywood
premiere
nagarjuna
naga chaitanya
ss rajamouli
sukumar
aamir khan film