Advertisementt

బిగ్ బాస్ హౌస్ లోకి షణ్ముఖ్

Fri 06th May 2022 04:09 PM
shanmukh jaswanth,shanmukh,bigg boss telugu ott,bigg boss,bigg boss nonstop  బిగ్ బాస్ హౌస్ లోకి షణ్ముఖ్
Shanmukh Jaswanth in Bigg Boss Non Stop house బిగ్ బాస్ హౌస్ లోకి షణ్ముఖ్
Advertisement
Ads by CJ

షణ్ముఖ్ గత సీజన్ లో బిగ్ బాస్ టైటిల్ ఫెవరెట్ గా అడుగుపెట్టి చివరికి రన్నర్ గా బయటికి వచ్చిన షణ్ముఖ్ ఆ టైటిల్ దూరమవడానికి సిరి తో చేసిన అతి ఫ్రెండ్ షిప్ మాత్రమే కారణం కాదు, షణ్ముఖ్ హౌస్ లో అస్సలు ఆక్టివ్ గా ఉండేవాడు కాదు. చాలా డల్ మూడ్ లో సిరి ని కంట్రోల్ చేస్తూ ఉండేవాడు. అదే అతని కొంప ముంచింది. టాస్క్ ల్లో యాక్టీవ్ గా లేకుండా.. మైండ్ గేమ్ ఆడిన షణ్ముఖ్ చివరికి ఎలాంటి ఫేమ్ లేని సన్నీ కి టైటిల్ ని అప్పజెప్పాల్సి వచ్చింది. ఇక హౌస్ నుండి బయటికి రాగానే గర్ల్ ఫ్రెండ్ దీప్తి సునయన తో బ్రేకప్ అయ్యి సైలెంట్ అయ్యాడు. తర్వాత చాలా రోజుల వరకు మీడియా కి దొరకలేదు. ఇక స్టార్ మా ప్రోగ్రామ్స్ కి అప్పుడప్పుడు హాజరయ్యే షణ్ముఖ్ బిగ్ బాస్ ఓటిటి లో తన ఫ్రెండ్ శివ కోసం మొన్నీమధ్యన స్టేజ్ పైకి వచ్చాడు.

ఇప్పుడు ఏకంగా హౌస్ లోకి అడుగుపెట్టాడు. మూడు రోజులుగా గత సీజన్ కంటెస్టెంట్స్ సిరి, మానస్, యాంకర్ రవిలు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి ఎవిక్షన్ ఫ్రీ పాస్ కంటెండర్ టాస్క్ లు పెడుతున్నారు. ఈ టికెట్ టు ఫినాలే టాస్క్ లో మొదటగా బాబా భాస్కర్ గెలిచారు. తర్వాత అనిల్, మూడో స్థానంలో బిందు ఉన్నారు. ఇక ఈరోజు ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం ఆడించాల్సిన టాస్క్ కోసం షణ్ముఖ్ బిగ్ బాస్ ఓటిట్ హౌస్ లోకి అడుగుపెట్టాడు. హౌస్ లో అఖిల్ - బిందు ఇప్పుడు కలిసిపోయారని, బయటికి వచ్చాక కలిసి ఉంటారా అని, మేమైతే కలుస్తాం అని అన్న షణ్ముఖ్ కి నటరాజ్ కాస్త వెటకారం చేసాడు. అదేమిటి మాస్టర్ ప్రోగ్రాం కోసం మనం బయట అప్పుడప్పుడు కలిసాం కదా అన్నాడు. తర్వాత షణ్ముఖ్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం టాస్క్ పెట్టాడు. ఆ తర్వాత హౌస్ మేట్స్ తో ఎంజాయ్ చేస్తూ డాన్స్ కూడా చేసిన ప్రోమో వైరల్ గా మారింది. 

Shanmukh Jaswanth in Bigg Boss Non Stop house:

Shanmukh Jaswanth Guest Entry Into Bigg Boss Telugu OTT

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ