ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Lady producer who gave warning to that hero

ఆ హీరోకి వార్నింగ్ ఇచ్చిన లేడీ ప్రొడ్యూసర్

ఇప్పుడిప్పుడే పైకి వస్తున్న ఓ కుర్ర హీరో రెండు మూడు సినిమాలతో బిజీ గా వున్నాడు. హీరోగా ఎంట్రీ ఇచ్చిన కొత్తల్లో సినిమాల కోసం అందరి దగ్గరికి వెళ్లి చాలా వినయంగా మాట్లాడతారు, కానీ రెండు మూడు సినిమాలు వచ్చాక తానేదో పెద్ద స్టార్ అనుకుంటారు. ఆ హీరో ఆమధ్య చేసిన ఓ సినిమా ఓ టి టి లో విడుదల అయి, మంచి హిట్ అయ్యింది. ఆ తరువాత ఈ మధ్య ఆ హీరో నటించిన మరో సినిమా కూడా ఓ టి టి లోనే విడుదల అయ్యింది. ఇప్పుడు ఏకంగా మరో రెండు సినిమాలు చేస్తున్నాడు. అందులో ఓ సినిమా షూటింగ్ కూడా చాలా వరకు పూర్తయ్యింది కూడా. మళ్ళీ హైదరాబాద్ లో ఒక షెడ్యూల్ స్టార్ట్ అవ్వాల్సి ఉండగా.. ఆ హీరో ఏవో వ్యక్తిగత కారణాలు చెప్పి షూటింగ్ కి రాలేను అన్నాడు. సదరు నిర్మాత కూడా సరే అని షూటింగ్ వాయిదా వేశారు. 

కానీ ఆ కుర్ర హీరో ఏమి చేసాడంటే.. ఏవో కారణాలు చెప్పి వెళ్లి మరొక సినిమా షూటింగ్ పూర్తి చేసేసాడు. ఇది తెలిసిన సదరు నిర్మాత కూడా ఆ యంగ్ హీరో కి వార్నింగ్ లా  ఇచ్చారట. కౌన్సిల్ లో కంప్లైంట్ చేస్తా ఇంకోసారి ఇలా చేస్తే అని. ఆ నిర్మాతకి అంతగా కోపం రావటానికి కారణం, ఆ హీరో తప్పుడు కారణాలు చూపించి వేరే సినిమా షూటింగ్ చెయ్యటం వలనేనట. మరి ఆ నిర్మాతకి సరైన కారణం చెప్పి చేస్తే, అంత కోపం రాదు. దానికి తోడు ఇప్పుడిప్పుడే పైకి వస్తున్న యాక్టర్ కూడా అలా చెయ్యటం ఆ నిర్మాతకి కొంచెం బాధ అనిపించింది. అందుకే వార్నింగ్ ఇచ్చిఅంట్లుగా ఫిలిం నగర్ లో గుసగుసలు వినబడుతున్నాయి.

Lady producer who gave warning to that young hero

Lady producer who gave warning to that hero
lady producer
young hero
2 movies
tollywood