బిగ్ బాస్ ఓటిటి వాయిదా

బిగ్ బాస్ సీజన్ 5 ముగిసి కేవలం నెలరోజులైంది. అప్పుడే సీజన్ 6 కి ఏర్పాట్లు ముమ్మరంగా మొదలైపోయాయి. ఈసారి బిగ్ బాస్ 24 గంటలు ప్లాన్ చేసారు. హాట్ స్టార్ ఓటిటిలో బిగ్ బాస్ సీజన్ 6 24  గంటలు ప్రేక్షకులకి అందుబాటులో ఉండబోతుంది. నాగార్జున హోస్ట్ గానే సీజన్ 6 స్టార్ట్ అవ్వబోతుంది. అయితే ఈసారి 15 మందితో మొదలు కాబోతున్న బిగ్ బాస్ లోకి పాత కంటెస్టెంట్స్ ఓ నలుగురైదుగురు రావొచ్చని ఊహాగానాలు ఉన్నాయి. మొత్తం 82 రోజుల పాటు ఈ సీజన్ సిక్స్ లోకి ఎంటర్ అవ్వబోయే కంటెస్టెంట్స్ లిస్ట్ అప్పుడే ఫైనల్ కూడా అయ్యింది అని, కంటెస్టెంట్స్ నుండి అగ్రిమెంట్స్ కూడా స్టార్ మా రాయించుకుంటున్నట్లుగా తెలుస్తుంది.

అయితే ఫిబ్రవరి 20 నుండి మొదలు కావాల్సిన బిగ్ బాస్ సీజన్ 6 ఇప్పుడు వాయిదా పడింది అంటున్నారు. ఓటీటీ లో మొదలు కాబోయే మొదటి సీజన్ ఫిబ్రవరి 20వ తేదీన ప్రారంభం కావడం లేదట. ఓ ఆరు రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి 26 నుంచి అంగరంగ వైభవంగా హాట్ స్టార్ లో మొదలు పెట్టబోతున్నారని తెలుస్తుంది. ఈసారి ఆదివారం నుండి కాకుండా శనివారమే బిగ్ బాస్ సీజన్ 6 మొదలు కాబోతుంది. అయితే ఓ వారం వాయిదా పడడానికి కారణం మాత్రం సెట్ వర్క్‌తో పాటు కొన్ని టెక్నికల్ పనులు పూర్తి కాకపోవడమేనని తెలుస్తోంది

Bigg Boss Telugu OTT Postponed?

Bigg Boss OTT Postponed
bigg boss
bigg boss telugu ott
bigg boss ott postponed