ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Prabhas Fans Upset With Radhe Shyam release date

ఇంత జరుగుతున్నా రాధే శ్యామ్ అలికిడేది

Prabhas Fans Upset With Radhe Shyam release datePrabhas Fans Upset With Radhe Shyam release date

నిన్న సోమవారం జనవరి 31 న ఉన్నట్టుండి.. పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ తాకిడికి సోషల్ మీడియా షేక్ అయ్యింది. పాన్ ఇండియా మూవీస్, బిగ్ బడ్జెట్ మూవీస్ అన్ని వరసగా రిలీజ్ డేట్స్ ప్రకటించేసారు. ఎన్టీఆర్ - రామ చరణ్ ఆర్.ఆర్.ఆర్ నుండి మహేష్ బాబు సర్కారు వారి పాట వరకు వరసగా రిలీజ్ డేట్స్ వచ్చాయి. ఆర్.ఆర్.ఆర్ మార్చి 25 న అంటే.. భీమ్లా నాయక్ మాత్రం ఫిబ్రవరి 25 కానీ లేదంటే ఏప్రిల్ 1 కానీ రిలీజ్ అవ్వొచ్చని రెండు డేట్స్ ఇచ్చారు. తర్వాత చిరు ఆచార్య ఏప్రిల్ 29 న, ఎఫ్ 3 ఏప్రిల్ 28 న రిలీజ్ అవుతున్నట్టుగా అఫీషియల్ గా డేట్స్ ఇచ్చారు.

ఇక మహేష్ బాబు సర్కారు వారి పాట మే 12 న రిలీజ్ కాబోతుంది. మరి ఇన్ని పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ వచ్చాయి.. కానీ ప్రభాస్ రాధే శ్యామ్ మేకర్స్ అలికిడి కనిపించలేదు. అంటే మార్చ్ 11 న రాధే శ్యామ్ రిలీజ్ అవ్వొచ్చనే ఊహాగానాలు మధ్యన వాళ్ళు కూడా ఈ రిలీజ్ డేట్స్ పండుగలో తమ డేట్ ఇచ్చేసి ఉంటే ప్రభాస్ ఫాన్స్ హ్యాపీ గా ఫీల్ అయ్యేవారు. కానీ రాధే శ్యామ్ మేకర్స్ మాత్రం రిలీజ్ డేట్ ప్రకటన ఇవ్వకుండా కామ్ గా కూర్చున్నారు. మరి ఆ డేట్ ఎప్పుడా అని ప్రభాస్ ఫాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు.

Prabhas fans angry on Radhe Shyam makers

prabhas
pooja hegde
radha krishna
radhe shyam