ఆ రూట్ లోకి ఎంటరైన ఆది సాయికుమార్

ప్రేమ కావాలి, లవ్ లీ వంటి వరుస హిట్స్ తో సక్సెస్ ఫుల్ గా తన కెరీర్ స్టార్ట్ చేసిన ఆది సాయికుమార్ ఆపై తడబడ్డాడు. సరైన కథలు కుదరక అపజయాలు అందిపుచ్చుకున్నాడు. అయితే ఆ విషయంలో ఇప్పటికి రియలైజ్ అయిన ఆది ప్రస్తుతం కథల విషయంలో కావాల్సిన కేర్ తీసుకుంటూ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. వాటిలో ఒకటి C S I సనాతన్. ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి శివ శంకర్ దేవ్ దర్శకుడు. అజయ్ శ్రీనివాస్ నిర్మాత.

క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - థ్రిల్ చేసే కాన్సెప్ట్.- రేసీ స్క్రీన్ ప్లే వంటివి ప్రస్తుతం ఎంతగా క్లిక్ అవుతున్నాయో, ఆ తరహా సినిమాలు, వెబ్ సిరీస్ లు ఎంతగా ప్రజాదరణ పొందుతున్నాయో గమనించాననీ... అందుకే ఆ రూట్ లోకి ఎంటర్ అయి అదే తరహా స్క్రిప్ట్ కలిగిన C S I సనాతన్.చిత్రాన్ని చాలా కాన్ఫిడెంట్ గా చేస్తున్నాను అనీ చెబుతున్నాడు ఆది సాయికుమార్. కాగా ఆ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ నేడు సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. మరి లుక్ అయితే ఎట్రాక్టివ్ గానే ఉంది. లక్ కూడా కాస్త కలిసొస్తే ఈ C S I సనాతన్ తో ఆది సాయికుమార్ మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కొచ్చు. 

Aadi Saikumar as CSI Sanathan

Aadi Saikumar CSI Sanathan First Look
aadi saikumar latest film csi sanathan
aadi saikumar new movie csi sanathan first look
ask 20 csi sanathan
Advertisement
Advertisement