ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bheemla Nayak vs Aadavaallu Meeku Johaarlu

భీమ్లా నాయక్ కి పోటీగానా..

సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన భీమ్లా నాయక్ ని ఆర్.ఆర్.ఆర్ కోసం పోస్ట్ పోన్ చెయ్యగా.. భీమ్లా నాయక్ కోసం ఎఫ్ 3 త్యాగం చేసి డేట్ మార్చుకుంది. ఫిబ్రవరి 25 న విడుదల కావాల్సిన ఎఫ్ 3 భీమ్లా నాయక్ కి ఆ డేట్ ని ఇచ్చేసింది. దానితో పవన్ కళ్యాణ్ - రానా కాంబోలో రాబోతున్న భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25 న ఫిక్స్ అయ్యింది. ప్రస్తుతం కోవిడ్ కారణంగా పలు భారీ బడ్జెట్ సినిమాలు వాయిదా పడుతున్నా.. భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25 నే రిలీజ్ అన్నట్లుగా మ్యూజిక్ డైరెక్టర్ చెబుతూ వస్తున్నారు. అంటే భీమ్లా నాయక్ ఖచ్చితంగా ఫిబ్రవరి 25 కే ఫిక్స్ అంటున్నారు.

మరి ఇప్పుడు భీమ్లా నాయక్ కే పోటీ అంటున్నాడు ఓ యంగ్ హీరో. శర్వానంద్, రష్మిక మందన్నా, తిరుమల కిషోర్, ఎస్ఎల్‌వీసీ ఆడవాళ్లు మీకు జోహార్లు ఫిబ్రవరి 25న విడుదల అంటూ డేట్ ప్రకటించేశాడు. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు, ఫస్ట్ లుక్‌తో సినిమా మీద పాజిటివ్ వైబ్స్ ఏర్పడ్డాయి. శర్వానంద్, రష్మిక జోడికి మంచి మార్కులు పడ్డాయి. మహిళలకు ప్రాధాన్యతను ఇచ్చేట్టుగా కనిపిస్తున్న ఈ చిత్రంలో మొదటసారిగా రష్మిక, శర్వానంద్‌లు కలిసి నటించారు. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఆడవాళ్లు మీకు జోహార్లు. ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. మరి భీమ్లా నాయక్ రేస్ నుండి తప్పుకుంటుంది అని శర్వా ధైర్యం చేస్తున్నాడా? లేదంటే తన సినిమాపై అంత నమ్మకమా? అనేది ఇప్పుడు ఫాన్స్ ముందున్న ప్రశ్న.

Sharwanand, Rashmika Mandanna, Tirumala Kishore, SLVC Aadavaallu Meeku Johaarlu To Release On February 25th

Bheemla Nayak vs Aadavaallu Meeku Johaarlu
pawan kalyan
bheemla nayak
rana
sharwanand
rashmika mandanna
tirumala kishore
slvc
aadavaallu meeku johaarlu
february 25th