పార్టీ చేసుకున్న లైగర్ టీం

విజయ్ దేవరకొండ హీరోగా న‌టిస్తోన్న యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్ లైగర్ (సాలా క్రాస్ బ్రీడ్) చిత్రంతో లెజెండ్ మైక్ టైసన్ ఇండియన్ స్క్రీన్ మీద కనిపించబోతోన్నారు. ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్నారు. మైక్ టైసన్ ఈ ప్రాజెక్ట్‌లోకి అడుగుపెట్టడంతోనే ఈ సినిమాపై అంచనాలు ఆకాశన్నంటాయి. ఇటీవ‌ల అమెరికాలో ప్రారంభ‌మైన ఈ మూవీ షెడ్యూల్ పూర్త‌య్యింది. ఈ షెడ్యూల్‌లో మైక్ టైస‌న్ పాత్ర‌కి సంభందించిన చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసింది చిత్ర యూనిట్.

మైక్ టైసన్ సంపూర్ణ సహాకారమందించారు.. ఆయ‌న‌తో షూటింగ్ స‌జావుగా సాగింది అంటూ షూటింగ్ లొకేష‌న్ నుండి కొన్ని ఫోటోల‌ను విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. ఈ ఫోటోల‌లో మైక్‌టైస‌న్ భార్య కికి ని కూడా చూడొచ్చు.

మైక్ టైసన్ ఈ చిత్రంలో కీలకమైన మరియు శక్తివంతమైన పాత్రను పోషించారు. ఈ చిత్రాన్ని బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

మైక్ టైసన్ రాకతో ఈ ప్రాజెక్ట్ అంచనాలు కూడా మారిపోయాయి. దానికి తగ్గట్టుగానే ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా భారీ ఎత్తున నిర్మిస్తున్నాయి.

థాయిలాండ్ స్టంట్ డైరెక్టర్ కెచ్చా యాక్షన్ సీక్వెన్స్‌లను కంపోజ్  చేస్తున్నారు. విష్ణు శర్మ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు.

It’s A Wrap For Vijay Deverakonda Liger Schedule With Legend Mike Tyson In USA

Liger USA Schedule Completed
vijay deverakonda
liger movie
liger us schedule
legend mike tyson
usa