Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Hari Hara Veera Mallu: Just one scene balance

హరిహర వీరమల్లు: జస్ట్ ఒక్క సీన్ బ్యాలెన్స్

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. మరోపక్క భీమ్లా నాయక్ షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. అయితే కరోనా సెకండ్ వేవ్ తర్వాత పవన్ కళ్యాణ్ - క్రిష్ కాంబో హరిహర వీరమల్లు రెస్యూమ్ షూట్ ఇంకా స్టార్ట్ కాలేదు. కారణం అటు పవన్ భీమ్లా నాయక్ షూటింగ్, ఇటు పాలిటిక్స్ తో బిజీ. ఇక క్రిష్ కొండపొలం మూవీ ప్రమోషన్స్ లో బిజీ. అందుకే హరిహర వీరమల్లు ఇంకా రెస్యూమ్ షూట్ మొదలు కాలేదు. అయితే తాజాగా క్రిష్ కొండపొలం ప్రమోషన్స్ లో పవన్ తో తాను చేస్తున్న హరిహర వీరమల్లు షూటింగ్ అప్ డేట్ ఇచ్చేసారు.

పవన్ కళ్యాణ్ - నిధి అగర్వాల్ కాంబోలో తెరకెక్కిస్తున్న హరిహర వీరమల్లు సినిమా ఫస్ట్ హాఫ్ కి సంబంధించి ఒకే ఒక్క సీన్ తీస్తే.. హరిహర వీరమల్లు ఫస్ట్ హాఫ్ చిత్రీకరణ పూర్తి అవుతుంది అని పవన్ ఫాన్స్ కి స్వీట్ న్యూస్ చెప్పారు క్రిష్. ఇక హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ కరోనా వలన ఆగిపోవడంతో ఆ టైం లో ఓ నవలని వైష్ణవ తేజ్ హీరోగా కొండపొలం తీద్దామనుకుంటున్నా అనగానే.. ఇలాంటి సినిమాలు రావాలని పవన్ చెప్పబట్టే ఈ కొండపొలం తెరకెక్కింది అని, అదే మరో హీరో అయితే తన్ని తరిమేసేవాడే అంటూ క్రిష్ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. 

Hari Hara Veera Mallu Movie update

Hari Hara Veera Mallu: Just one scene balance
hari hara veera mallu movie
krish
pawan kalyan
pawan kalyan - krish
hari hara veera mallu movie update