బర్త్ డే అంటే అంత క్రేజ్

పుట్టిన రోజు అంటే ఎవరికి మాత్రం క్రేజ్ ఉండదు. చిన్న వాళ్ళైనా, పెద్దవాళ్లైనా బర్త్ డే రోజున కొత్త డ్రెస్ వేసుకుని, కేక్ కట్ చేసి అందరికి చాకలేట్స్ పంచడం ఏంతో హుషారినిస్తుంది. అదే సెలబ్రిటీస్ అయితే కేక్ కట్ చేసి పబ్ ల్లో, లేదంటే ఏ వెకేషన్స్ కో వెళ్లి పార్టీలు చేసుకుంటారు. తాజాగా బుట్టబొమ్మ, పాన్ ఇండియా హీరోయిన్ పూజ హెగ్డే కి బర్త్ డే అంటే యమా క్రేజ్ అంట. తన బర్త్ డే వస్తుంది అంటే ఓ నెల ముందు నుండే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేస్తుందట. 

పూజ హెగ్డే ది అక్టోబరు 13న పుట్టినరోజు. నిజానికి అది ఆ నెలలో 13 అనేది ఒక రోజే అయినా.. పూజ కి మాత్రం నెల రోజులు పండగలా అనిపిస్తుందని చెబుతుంది. బర్త్ డే రోజున ఫ్రెండ్స్ ఎలా ఎంజాయ్ చెయ్యాలి, అలాగే నెల ముందు నుంచే నేను కౌంట్‌డౌన్‌ మొదలు పెట్టుకుంటాను అని చెబుతుంది. ఇక పుట్టినరోజు వచ్చిందంటే.. నా వరకు నాకది నేషనల్‌ హాలీడే అన్నట్లుగా ఉంటుంది అని చెబుతుంది పూజ హెగ్డే. కేక్ కట్ చెయ్యడం. ఆరోజంతా స్నేహితులతో పార్టీ చేసుకుంటూ సరదాగా గడిపేస్తా అంటూ రాబోయే తాన్ బర్త్ డే ప్లాన్స్ ని రివీల్ చేసింది పూజ. 

Pooja hegde says Birthday is such a craze

Pooja hegde Birthday plans revealed
pooja hegde
pooja hegde birthday
pooja hegde birthday celebrations