ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Nayanthara-Vignesh Shivan Marriage Date Fixed?

నయనతార పెళ్లి డేట్ ఫిక్స్

Nayanthara-Vignesh Shivan Marriage Date Fixed?Nayanthara-Vignesh Shivan Marriage Date Fixed?

ఈమధ్యన లేడీ సూపర్ స్టార్ నయనతార లవర్ విగ్నేష్ శివన్ తో ఎంగేజ్మెంట్ చేసుకుంది అంటూ వార్తలొచ్చినా నయనతార కానీ విగ్నేష్ కానీ ఈ విషయమై ఎక్కడా స్పందించలేదు. ఇక పెళ్లి చేసుకోకుండా ఎప్పటినుండో కలిసి ఉంటున్న నయనతార - విగ్నేష్ లు తాము పార్టీ చేసుకున్నా, లేదా వెకేషన్స్ కి బయటికి వెళ్లినా ఆ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. నయనతార పుట్టిన రోజు వేడుకలు, నయనతార అమ్మ కురియన్ బర్త్ డే వేడుకలు, విగ్నేష్ బర్త్ డే వేడుకలు ఇలా ఏ అకేషన్ అయినా ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. తాజాగా  విఘ్నేశ్‌ 36వ పుట్టినరోజు న న‌య‌న‌తార స్పెషల్ పార్టీ ఇచ్చింది. దీంతో ప్రియురాలు నయన్ కి విఘ్నేశ్ థ్యాంక్స్ చెప్పాడు.

అయితే తాజాగా విగ్నేష్ శివన్ - నయనతార పెళ్లి డేట్ ఫిక్స్ అయ్యింది అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అందులో నిజమెంతుందో కానీ.. నయన్ - విగ్నేష్ ల పెళ్లి మాత్రం క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న కేరళలోని ప్రముఖ చర్చలో  జరగబోతుందని తెలుస్తోంది. కొద్దిమంది సన్నహితుల మధ్యనే పెళ్లి చేసుకోవాలని ఈ జంట భావిస్తున్నట్లుగా సమాచారం. మరి నయన్ పెళ్లి డేట్ పై జరుగుతన్న ప్రచారం నిజం కావాలని ఆమె ఫాన్స్ కోరుకుంటున్నారు. 

Nayanthara-Vignesh Shivan Marriage Date Fixed?

nayanthara
vignesh shivan
nayanthara-vignesh shivan marriage date
nayan - vignesh
O.M Review
O.M Review
26 Nov 2026
Maya Lady Review
Maya Lady Review
26 Nov 2026
DNK Review
DNK Review
26 Nov 2026
GOAT Review
GOAT Review
26 Nov 2026
Scene Review
Scene Review
26 Nov 2026
Ramayana Review
Ramayana Review
26 Nov 2026