Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bigg Boss Season 5 Top 5 contestants fixed?

ఆ లెక్కన బిగ్ బాస్ టాప్ 5 లో వాళ్ళే ఉంటారు

బిగ్ బాస్ సీజన్ 5 స్క్రిప్ట్ ప్రకారమే మొదలయ్యింది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. నిజంగానే హౌస్ లోకి అడుగుపెట్టిన 19 మంది కంటెస్టెంట్స్ అందరూ వీడియో ఫుటేజ్ కోసం ఏం చెయ్యాలో అదే చేస్తున్నారు. స్క్రీన్ స్పేస్ కోసం ఏం  చేస్తే ఆ స్పేస్ దొరుకుతుందో అదే ఫాలో అవుతున్నారు. కొట్లాటలు, ఏడుపులు, ఫైట్స్, కామెడీ వీటినే నమ్ముకున్నారు. తాజాగా బిగ్ బాస్ హౌస్ నుండి మొదటి ఎలిమినేషన్స్ లో సరయు బయటికి వచ్చేసింది. ఆమె వచ్చిన దగ్గరనుండి మాట్లాడిన మాటలు చూస్తే బిగ్ బాస్ పక్కా స్క్రిప్ట్ ప్రకారమే నడుస్తుంది అని అనిపిస్తుంది. 

సిరి హన్మంత్, యాంకర్ రవి, సన్ని, షణ్ముఖ్ లు పర్ఫెక్ట్ ప్లాన్ తో గేమ్ ఆడుతున్నారని, వారు ఓ గ్రూప్ గా ఫామ్ అయ్యి.. మిగతా వారిని తొక్కేస్తున్నారని, రవి మామూలోడు కాదని, సిరి గెలవడం కోసం మగవాళ్ళని వాడేస్తుంది అని, సన్నీ ఈగో పర్సన్ అని, షణ్ముఖ్ ఏదో సాఫ్ట్ అనుకున్నాను, కానీ ఖతర్నాక్ అని... వాడొక ఆడింగి వాడు అంటూ సంచలనంగా మాట్లాడింది. ఈ నలుగురు మిగతా వారిని తొక్కేస్తారని.. వీరే టైటిల్ గెలుస్తారంటూ సరయు సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. మరి నిజంగా సరయు చెప్పినట్లు సిరి, రవి, సన్నీ, షణ్ముఖ్ లే టాప్ 5 లో ఉండే ఛాన్స్ ఉందేమో అనిపించడం లేదూ.. 

Bigg Boss Season 5 Top 5 contestants

Bigg Boss Season 5 Top 5 contestants fixed?
bigg boss season 5
bigg boss telugu season 5
bigg boss
bigg boss season 5 top 5 contestants