Advertisementt

PSPK 28 పవర్ ఫుల్ టైటిల్ అండ్ లుక్

Thu 09th Sep 2021 10:03 AM
pawan kalyan,pspk28 title,pspk 28 title bhavadeeyudu bhagat singh,pawan kalyan bhavadeeyudu bhagat singh movie,bhavadeeyudu bhagat singh first look  PSPK 28 పవర్ ఫుల్ టైటిల్ అండ్ లుక్
Pawan Kalyan Starrer PSPK28 Movie Title And First look revealed PSPK 28 పవర్ ఫుల్ టైటిల్ అండ్ లుక్
Advertisement

పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సెట్స్ మీద షూటింగ్ ఓ రేంజ్ లో సాగుతుంది. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో భీమ్లా నాయక్ షూటింగ్ పోలీస్ స్టేషన్ సెట్ లో చిత్రీకరిస్తున్నారు. ఆ తర్వాత క్రిష్ కాంబోలో హరి హర వీరమల్లు సినిమా చేస్తున్న పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన హరీష్ శంకర్ తో మరో మూవీ కమిట్ అవడము.. ఇప్పటికే ప్రీ లుక్స్ తో సినిమాపై క్రేజ్ పెంచెయ్యడం చూసాం. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో హరీష్ శంకర్ - పవన్ కాంబో PSPK 28 ప్రీ లుక్ పై అంచనాలు ఏర్పడ్డాయి. ఇక నిన్న PSPK 28 అప్ డేట్ అంటూ మేకర్స్ ప్రకటించగానే పవన్ ఫాన్స్ సందడి మొదలైపోయింది. 

అనుకున్న టైం కి అంటే ఈ రోజు గురువారం 9.45 కి PSPK 28 ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ ని రివీల్ చేసి ఫాన్స్ ని సర్ ప్రైజ్ చేసారు. పవన్ కళ్యాణ్ - హరీష్ కాంబో మూవీ కి భవదీయుడు - భగత్ సింగ్ అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టడమే కాదు.. బైక్ పై పవన్ కళ్యాణ్ లుక్ నిజంగా అదిరింది. పవర్ ఫుల్ లుక్ లో భవదీయుడు భగత్ సింగ్ గా పవన్ కళ్యాణ్ మోడరన్ బైక్ పై కూర్చుని టీ తాగుతూ స్టయిల్ గాను, పొగరుగాను కనిపిస్తున్నారు. 

భవదీయుడు అన్న పదం వినయం, విధేయత గా అనిపిస్తే... భగత్ సింగ్ విప్లవ చైతన్యానికి మారుపేరు గా స్ఫురిస్తుంది. 

ఈ రెండింటినీ కలిపి ఈ చిత్రానికి భవదీయుడు భగత్ సింగ్ అని పెట్టడంలో దర్శకుడు ఆంతర్యమేమిటి...? 

ఈ చిత్రం ఓ లేఖ అయితే.. భవదీయుడు భగత్ సింగ్ అనేది ఓ సంతకం అయితే.....ఈ లేఖలో ఏం రాశారు, ఏం చెప్పాలనుకున్నారు, ఏం చెప్పబోతున్నారు, అన్నీ ఆసక్తిని, ఆలోచనలు రేకెత్తించేవే.... చిత్రంలో సామాజిక అంశాల ప్రస్తావన తప్పని సరా ?. ఇక పవన్ భవదీయుడు భగత్ సింగ్ లుక్ చూసిన పవన్ ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ లుక్ అండ్ టైటిల్ చూడగానే మరో గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ ఖాయమని ఫిక్స్ అవుతున్నారు. 

Pawan Kalyan Starrer PSPK28 Movie Title And First look revealed:

Pawan Kalyan PSPK28 Title Bhavadeeyudu BhagatSingh launch

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement