అల్లు అర్జున్ హీరో ఎట్లా?

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో పాన్ ఇండియా లెవల్లో పుష్ప సినిమాని భారీ బడ్జెట్ తో మేకర్స్ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లోనే చిత్రీకరణ జరుపుకుంటున్న పుష్ప మూవీలో అల్లు అర్జున్ ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్ గా మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. లారీ డ్రైవర్ గా మాస్ గా ఎర్ర చందనం దుంగలని కొట్టేసే బ్యాచ్ లో హీరోగా పోలీస్ లనే చంపేసే అల్లు అర్జున్ పుష్పరాజ్ గా ఈ సినిమాకి హీరో ఎట్లా అవుతాడనే అనుమానాలు అందరిలో ఉన్నాయి. ఇక తాజాగా పుష్ప విలన్ రోల్ ని పరిచయం చేసారు. 

మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ ని పోలీస్ అధికారిగా భన్వర్ సింగ్ గా హీరోగా చూపించారు. అంటే ఎర్ర చందనం దుంగలని స్మగుల్స్ చేసే పుష్ప రాజ్ బ్యాచ్ ని పట్టుకునే పోలీస్ అధికారిగా ఫహద్ ఫాజిల్ పాత్ర ఉండబోతుంది అంటే.. అల్లు అర్జున్ విలన్.. ఫహద్ ఫాజిల్ హీరో కింద ప్రొజెక్ట్ అవుతుంది. మరి నిజంగా అల్లు అర్జున్ విలన్ నుండి హీరోగా ఎప్పుడు మారతాడు, ఫహద్ ఫాజిల్ హీరో వేషంలో విలన్ వేషాలు ఎలా వేస్తాడనే ఆసక్తి ఇప్పుడు అల్లు ఫాన్స్ లోనే కాదు.. అందరిలోనూ మొదలైపోయింది. ఇక రశ్మిక కూడా పుష్ప సినిమాలో విలేజ్ అమ్మాయి గెటప్ లో కనిపించబోతుంది. 

Fahadh Faasil first look from Allu Arjun Pushpa

How much is Allu Arjun a hero?
allu arjun - pushpa
rashmika mandanna
allu arjun
pushpa movie
sukumar pushpa
fahad fasil
pushpa pan india film
bunny - sukku combo
allu arjun-sukumar combo
rashmika-allu arjun combo
fahad villain in pushpa
pushpa raj
fahad fasil vs allu arjun