Advertisement

పేరు మార్చుకుంటావా.. బాబు!

Sun 15th Aug 2021 12:52 PM
vishwak sen,vishwak sen appeals to film critics,attack with words,vishwak sen change this name  పేరు మార్చుకుంటావా.. బాబు!
Will Vishwak Sen change this name పేరు మార్చుకుంటావా.. బాబు!
Advertisement

ఇప్పుడు యంగ్ హీరో విశ్వక్ సేన్ కి నెటిజెన్స్ వేస్తున్న ప్రశ్న.. విశ్వక్ బాబు పేరు ఎప్పుడు మార్చుకుంటున్నావ్ అని. సినిమా బాగోకపోతే చెప్పండి పేరు మార్చుకుంటాను అంటూ తాను నటించిన పాగల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ల నోటి కొచ్చింది మాట్లాడి ఇప్పుడు నెటిజెన్స్ చేతిలో అడ్డంగా బుక్ అయ్యాడు. విశ్వక్ సేన్ రీసెంట్ మూవీ పాగల్ ని నిన్న శుక్రవారమే రీలీజ్ చేసారు. అయితే పాగల్ ప్రమోషన్స్ లో పాగల్ సినిమా నేను చూసాను. నాతొ పాటు చాలామంది చూసారు. సినిమా బావుంది.. ఒకవేళ మీరు బాలేదు సినిమా అంటే నా పేరు మార్చుకుంటాను అంటూ సంచలనంగా మాట్లాడాడు. అంతేకాకుండా పాగల్ ఇంటర్వూస్ లో పాగల్ మూవీ ని రివ్యూ రైటర్స్ మోసేయ్యకండి. 

నా సినిమాలు బావున్నా రివ్యూ రైటర్స్ నన్ను మోసేస్తున్నారు. పాగల్ విషయంలో నన్ను మొయ్యకండి అంటూ రివ్యూ రైటర్స్ పై సన్సేషనల్ కామెంట్స్ చేసాడు. మరి విశ్వక్ సేన్ కాన్ఫిడెన్స్ ని పాగల్ సినిమా ఘోరంగా దెబ్బకొట్టింది. అసలు ఈ కథని విశ్వక్ ఎలా ఓకె చేసాడో ఇప్పటికి అందరికి అనుమానమే. ఎమోషన్, లేదు, లవ్ లేదు.. అసలేమీ లేదు. అందుకే పాగల్ సినిమాని ప్రేక్షకులు తిప్పికొట్టారు. పాగల్ సినిమాకి రివ్యూ రైటర్స్ తక్కువ రేటింగ్ ఇచ్చారు. సినిమాలో విషయం లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు. మరి సినిమా నచ్చకపోతే పేరు మార్చుకుంటా అంటూ శపధం చేసావ్ కదా విశ్వక్.. మరి ఇప్పుడు ఏం పేరు పెట్టుకుంటావ్ అంటూ నెటిజెన్స్ కామెడీ చేస్తున్నారు. 

Will Vishwak Sen change this name:

Vishwak Sen appeals to film critics not to attack with words

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement