చిరు153 నుండి బిగ్ సర్ప్రైజ్

చిరంజీవి ఆచార్య ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణతో బిజీగా ఉన్నారు. ఆచార్య షూటింగ్ ఫినిష్ అవ్వగానే చిరు మోహన్ రాజా దర్శకత్వంలో లూసిఫర్ రీమేక్ సెట్స్ కి వెళ్ళిపోతారు. ఇప్పటికే థమన్ లూసిఫర్ రీమేక్ మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలు పెట్టేసారు. మరోపక్క దర్శకుడు మోహన్ రాజా చిరు 153 కోసం సెట్స్ ని రెడీ చేస్తున్నారట. ఎప్పుడో పూజ కార్యక్రమాలతో మొదలైన చిరు 153 ఇంకా రెగ్యుల్ షూట్ మొదలు పెట్టుకోలేదు. చిరు 153 కోసం ఓ అద్భుతమైన సెట్ ని నిర్మిస్తున్నారు. అది కూడా ఆచార్య కోసం టెంపుల్ సెట్ వేసిన సెల్వరాజన్ చిరు 153 కోసం మరో భారీ సెట్ ని నిర్మిస్తున్నారు. 

కొత్తది ఏదైనా ఆనందాన్ని ఇస్తుంది. కొత్త రోజు కొత్త ప్రారంభం. నా క్రొత్త చిత్రం కోసం సెట్ వర్క్ ప్రారంభిస్తున్నాను అంటూ సెల్వరాజ్ ట్వీట్ చేసారు. మోహన్ రాజా ఆధ్వర్యంలో ఈ సెట్ నిర్మాణం మొదలైనట్లుగా పిక్స్ ని పోస్ట్ చేసాడు సెల్వరాజ్. నా ఫస్ట్ మూవీ నుండి ప్రతి కొత్త మూవీ కి నేను తీసుకువెళ్ళిన పాత జిట్టర్లతో నేను మరొక అద్భుతాన్ని తీయగలనని నిర్ధారించుకున్నాను అంటూ సెల్వరాజ్ 153 పై చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక మెగా ఫాన్స్ అయితే చిరు 153 ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఈ సోషల్ మీడియా అప్ డేట్స్ చూసి హ్యాపీ గా పండగ చేసుకుంటున్నారు. 

Chiru Lucifer remake update

Crazy update on Chiru 153
chiranjeevi
chiru153
lucifer remake
mohan raja - chiranjeevi
director mohan raja
s.s.thaman
chiru 153 sets
selva raj