నెటిజెన్ కోతి ప్రశ్నకి సిద్దు దిమ్మతిరిగే కౌంటర్

లవర్ బాయ్ సిద్దార్థ్ కొన్నాళ్లుగా తెలుగు సినిమాలకు దూరమయ్యాడు. చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ మహాసముద్రం సినిమాతో తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తున్న సిద్దార్థ్ ఈమధ్యన బిజెపి ప్రభుత్వంపై ఒంటికాలుతో లేస్తున్నాడు. బిజెపి ప్రభుత్వం అసమర్ధపాలన అంటూ సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్న సిద్దార్థ్ ని హేట్ చేసే వాళ్ళు చాలామంది బయలుదేరారు. తాజాగా ఓ నెటిజెన్ సిద్దార్థ్ సహనం కోల్పోయేలా చేసాడు. అదేమిటంటే.. నారప్ప లో వెంకటేష్ తనకన్నా వయసులో చాలా చిన్న అమ్మాయితో ఓ సాంగ్ లో కాలుకదపగా ఈ వయసులో వెంకీ చిన్న అమ్మాయితో రొమాన్స్ చేయడంపై ట్రోల్ చేస్తున్నారు నెటిజెన్స్.
అందులోకి హీరో సిద్దార్థ్ ని పట్టుకొచ్చారు. 40 ఏళ్లు పైబడిన సిద్ధార్త్‌తో వయసు తక్కువ హీరోయిన్లు నటిస్తే మాత్రం అది క్రేజ్ కానీ.. ఇదెక్కడి న్యాయం అంటూ సిద్దార్థ్ కెలికిన ఆ నెటిజెన్.. నువ్వు ప్రకాష్ రాజ్ క్లాస్ మేట్ వి అంటగా అంటూ ట్వీట్ చెయ్యడంతో సహనం కోల్పోయిన సిద్దార్థ్.. నేను ప్రకాష్ రాజ్ క్లాస్ మేట్ ని కాదు. ఆయన నా దత్త పుత్రుడు. నేను మోహన్ బాబు గారి క్లాస్ మేట్ ని.. హీరోల వయసు గుర్తుకురాగానే ఫస్ట్ నేనే గుర్తుకు వచ్చానా మీకు.. ఇదెక్కడి దరిద్రం అంటూ కాస్త స్ట్రాంగ్ గానే రిప్లై ఇచ్చాడు సిద్దు.
Actor Siddharth Strong Reply To Social Media Trolls
Siddharth Strong Reply To Social Media Trolls







































