ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Interesting update on Prabhas Radhe Shyam

ప్రభాస్ రాధేశ్యామ్ అప్ డేట్

ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో రాధే శ్యామ్ పాన్ ఇండియా ఫిలిం షూటింగ్ లో పాల్గొంటున్నారు. రాధే శ్యామ్ షూటింగ్ ఫైనల్ షెడ్యూల్ పూర్తవ్వగానే ప్రభాస్ ముంబై  వెళ్ళిపోతారు. అక్కడ ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ షూటింగ్ లో పాల్గొంటారు. ప్రస్తుతం ప్రభాస్ లేకుండానే ముంబై లోని ఓ సెట్ లో ఆదిపురుష్ షూటింగ్ జరుగుతుంది. విలన్ రావణ్ పాత్రధారి సైఫ్ అలీ ఖాన్ పై  చిత్రీకరిస్తున్నారు దర్శకుడు. అయితే ఆగష్టు ఫస్ట్ వీక్ వరకు రాధే శ్యామ్ షూటింగ్ ఉంటుంది అని తెలుస్తుంది. 

ఇప్పటికే పూజ హెగ్డే తన పాత్ర షూటింగ్ కంప్లీట్ చేసుకుని చెన్నై కి వెళ్ళిపోయింది. ప్రభాస్ కూడా త్వరగా రాధే శ్యామ్ షూటింగ్ ఫినిష్ చెయ్యాలని చూస్తున్నారు. జులై 23 న రాధే శ్యామ్ చివరి షెడ్యూల్ మొదలై ఆగష్టు 5 వరకు జరుగుతుంది అని.. ఆ తర్వాత ప్రభాస్ ఆదిపురుష్ - సలార్  షూటింగ్స్ లో పాల్గొంటారని తెలుస్తుంది. ఈ రెండు సినిమా షూటింగ్స్ ఓ కొలిక్కి రాగానే ప్రభాస్ - నాగ్ అశ్విన్ మూవీ షూట్ కూడా మొదలు కాబోతుంది. ఇక ప్రస్తుతం రాధే శ్యామ్ అప్ డేట్ కోసం ప్రభాస్ ఫాన్స్ ఎప్పటిలాగే కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు ఇస్తారో అని. 

Prabhas Radhe Shyam update

Interesting update on Prabhas Radhe Shyam
radhe shyam pan india film
prabhas radhe shyam
pooja hegde radhe shyam
radhakrishna radhe shyam movie
uv creations radhe shyam
radhe shyam movie
radhe shyam update