Advertisement

కొంచెం లేట్ అంటున్న సలార్ టీం

ప్రభాస్ సెకండ్ వేవ్ తగ్గగానే.. రాధేశ్యామ్ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. రాధేశ్యామ్ లో కొద్దిపాటి షూటింగ్ బ్యాలెన్స్ ఉన్న కారణముగా ముందు ప్రభాస్ దానిని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఆ సినిమా అవ్వగానే ప్రభాస్ సలార్ అలాగే ఆదిపురుష్ షూటింగ్స్ ని మొదలు పెడతారు. రెండు సినిమాల షూటింగ్స్ ని ప్రభాస్ పారలల్ గా చేయబోతున్నారనే విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం సలార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ 2 ని పూర్తి చేసే పనిలో ఉన్నారట. 

అందుకే సలార్ షూటింగ్ ని జులై ఫస్ట్ వీక్ లో మొదలుపెట్టాలని ముందు అనుకున్నా ఇప్పుడు అది ఆగస్టు కి షిఫ్ట్ అయినట్లుగా తెలుస్తుంది. కెజిఎఫ్ పూర్తి చేసి రిలీజ్ కి రెడీ చేశాకే సలార్ షూటింగ్ కి ప్రశాంత్ నీల్ వెళ్తారట. సో ఒక నెల అటు ఇటుగానే సలార్ షూట్ ని స్టార్ట్ చేస్తారట. ఈలోపు ప్రభాస్ ఆదిపురుష్ లో మేజర్ సీక్వెన్సెస్ పూర్తి చేస్తారని తెలుస్తుంది. 

సలార్ ఇప్పటికే గోదావరి ఖని బొగ్గు గనుల్లో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా శృతి హాసన్ నటిస్తుంది. ఈ సినిమాలో శృతి హాసన్ కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చేస్తుందట. 

Prabhas - Prashanth Neel Salaar regular shoot plans revealed

Salaar to resume shoot in August?
prabhas
salaar pan india film
prabhas salaar movie
prashanth neel - prabhas combo
prabhas - shruthi haasan combo
prabhas - prashanth neel - shruthi haasan combo
salaar prabhas
prashanth neel salaar
salaar villina
salaar hero prabhas