ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> RRR poster use for helmet awareness by Cyberabad Traffic police

ఆర్.ఆర్.ఆర్ పోస్టర్ తో పోలీస్ పబ్లిసిటీ

RRR poster use for helmet awareness by Cyberabad Traffic policeRRR poster use for helmet awareness by Cyberabad Traffic police

ఈ రోజు ఉదయం ఆర్.ఆర్.ఆర్ నుండి భారీ అప్ డేట్ వచ్చింది. కేవలం రెండు పాటల చిత్రీకరణతో ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ పూర్తి కాబోతుంది అని, హీరోలు డబ్బింగ్ చెప్పడానికి రెడీ అంటూ, అనుకున్న డేట్ కి అంటే అక్టోబర్ 13 న సినిమా థియేటర్స్ లో రిలీజ్ అంటూ బిగ్గెస్ట్ అప్ డేట్ ఇస్తూనే ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ లు కొమరం భీం - అల్లూరి గెటప్స్ లో బైక్ మీద వెళుతున్న పోస్టర్ ని రిలీజ్ చేసారు. ఎన్టీఆర్ బైక్ డ్రైవ్ చేస్తుండగా.. రామ్ చరణ్ వెనకగా కూర్చున్న పోస్టర్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. 

అయితే ఇప్పుడు ఆ పోస్టర్ ని సైబరాబాద్ పోలీస్ లు పబ్లీసిటికి వాడేసుకున్నారు. హెల్మెట్ లేని ప్రయాణం నేరము, ప్రమాదం అంటూ ఎంత అవగాహన కలిపించినా చాలామంది హెల్మెట్ లేని ప్రయాణంతో ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే తాజాగా విడుదలైన ఆర్.ఆర్.ఆర్ పోస్టర్ లో చరణ్ - ఎన్టీఆర్ లు బైక్ పైన హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతున్నారు. 

ఆ పోస్టర్ లో ఎన్టీఆర్ కి రామ్ చరణ్ కి హెల్మెట్స్ జోడించి వదిలారు. ఇప్పుడు సరిగ్గా ఉంది. హెల్మెట్‌ ధరించండి. సురక్షితంగా ఉండండి అంటూ ఆ ఫోటో కి క్యాప్షన్ పెట్టారు. అది చూసిన ఆర్ ఆర్ ఆర్ టీం.. ఇప్పటికి సరిగా లేదు.. ఆ బైక్ కి నెంబర్ ప్లేట్ మిస్ అయ్యింది అంటూ కామెడీ చేసేసారు. 

Cyberabad Police Using RRR Movie Poster For Awareness

cyberabad police
using rrr movie poster
helmet awareness