ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Pushpa teaser creates All Time Record in Tollywood

పుష్ప రాజ్ రేర్ ఫీట్

అల్లు అర్జున్ ని స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్ గా మార్చిన పాన్ ఇండియా మూవీ పుష్ప షూటింగ్ ప్రస్తుతం తెలంగాణాలో జరుగుతుంది. సుకుమార్ - అల్లు అర్జున్ పుష్ప సినిమాని పాన్ ఇండియా లెవల్లో మొదలు పెట్టినప్పటినుండి సినిమాపై భారీ అంచనాలున్నాయి. అల్లు అర్జున్ పుష్ప రాజ్ లుక్ అన్ని భాషా ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంది. పుష్పరాజ్ తగ్గేదే లే అంటూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ పుష్ప సినిమాకి వర్తించేలాగే కనిపిస్తుంది. పుష్ప టీజర్ ఇంకా యూట్యూబ్ లో ప్రభంజనం సృష్టిస్తుంది. పుష్ప ఫస్ట్ లుక్ తోనే సంచలనాలకు తెరలేపిన సుక్కు - బన్నీ లు ఇప్పుడు పుష్ప టీజర్ తో మరిన్ని అంచనాలు పెంచేశారు.

అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్ గా పుష్ప టీజర్ ని వదిలింది టీం. ఈ  టీజర్ విడుదలైన కొన్ని క్షణాల్లోనే రికార్డ్స్ వ్యూస్ రాగా.. ఇప్పటివరకు అతి తక్కువ సమయంలోనే ఏకంగా 50 మిలియన్స్ ప్రేక్షకులు వీక్షించిన టీజర్ గా పుష్ప రికార్డులు సృష్టించింది. చాలా కొద్దీ రోజుల్లోనే పుష్ప టీజర్ ఈ రేర్ ఫీట్ సాధించడంతో అల్లు అర్జున్ ఫాన్స్ పుష్ప టీజర్ ని సోషల్ మీడియాలో మరోసారి ట్రేండింగ్ లోకి తీసుకొచ్చారు. టీజర్ తో సంచనాలకు నెలవుగా మారిన పుష్ప సినిమా విడుదలైతే.. మరెన్ని రికార్డులని క్రియేట్ చేస్తుందో అంటున్నారు. అన్నట్టు ఆగష్టు 13 న పుష్ప రిలీజ్ అవడమే అనేది పక్కాగా కనిపిస్తుంది.

 

Introducing Pushpa Raj: Teaser Creates All Time Record

Pushpa teaser creates All Time Record in Tollywood
allu arjun
bunny
sukumar
bunny - sukku combo
icon star allua rjun
stylish star allu arjun
pushpa pan india film
introducing pushpa raj
teaser
creates
all time record