Advertisement

పవన్ మ్యానియాతో.. యూట్యూబ్ షేక్

పవన్ కళ్యాణ్ కి ఫ్యానిజం ఎంతుందో.. ఆయన ప్రతి సినిమా విషయంలో నిరూపణ అవుతూనే ఉంది. రాజకీయాలతో సినిమాలకు గ్యాప్ ఇచ్చినా ఆయన క్రేజ్ ఇసుమంతైనా తగ్గలేదనేది ఆయన లేటెస్ట్ ఫిలిం వకీల్ సాబ్ పెద్ద ఉదాహరణగా నిలుస్తుంది. వకీల్ సాబ్ అప్ డేట్స్ ని ట్రేండింగ్ లో ఉంచే పవన్ ఫాన్స్ వకీల్ సాబ్ ట్రైలర్ ని టాప్ లో ఉంచారు. వకీల్ సాబ్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది మొదలు నిమిష నిమిషానికి వకీల్ సాబ్ ట్రేండింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. వకీల్ సాబ్ యూట్యూబ్ రికార్డ్స్ ని తిరగ రాసింది. ఈ సినిమా ట్రైలర్ మోస్ట్ లైక్డ్ ట్రైలర్‌గా చరిత్ర సృష్టించింది. ఊహించినట్లుగా ఆల్ టైమ్ రికార్డులు క్రియేట్ చేస్తుంది.

ఒక్క ట్రైలర్ కే ఫాన్స్ ఇంత రచ్చ చేస్తుంటే సినిమా విడుదలైతే థియేటర్స్ దగ్గర సీన్ ఊహించుకోవడానికే ఊహకి కూడా అందడం లేదు. పవన్ ఫాన్స్ 20 గంటల 27 నిమిషాల్లో 9.47 లక్షల లైకులు తో దూసుకుపోయిన వకీల్ సాబ్ ట్రైలర్ 24 గంటల్లోపే 10 లక్షల లైకులు క్రాస్ చేసి మిగతా హీరోలకు భారీ టార్గెట్ పెట్టింది. టాలీవుడ్‌లో అత్యధిక లైక్స్ సాధించిన ట్రైలర్‌గా వకీల్ సాబ్ చరిత్ర తిరగరాసింది. స్టిల్ ఇప్పటికి వకీల్ సాబ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది అంటే పవన్ మ్యానియా ఎంతగా ఉందొ ఫాన్స్ మరోసారి నిరూపించేసారు.

Pawan Kalyan Vakeel Saab Trailer mania

Vakeel Saab Trailer mania
vakeel saab trailer mania
vakeel saab movie
pawan kalyan
pawan klayan vakeel saab movie
vakeel saab biggest update
dil raju
sri venkateswara creations
vakeel saab music fest
vakeel saab trailer
vakeel saab pre release event
vakeel saab review