Advertisement

హిట్ ఇచ్చిన డైరెక్టర్ కి హ్యాండ్ ఇవ్వడం కరెక్టేనా?

Sat 09th Jan 2021 09:30 AM
gopichand,director teja,maruthi,alivelu venkata ramana,jayam movie,nijam movie,gopichand villain,hero gopichand,teja,maruthi - gopichand combo,uv creations  హిట్ ఇచ్చిన డైరెక్టర్ కి హ్యాండ్ ఇవ్వడం కరెక్టేనా?
Is it correct to give a hand to the director who gave the hit? హిట్ ఇచ్చిన డైరెక్టర్ కి హ్యాండ్ ఇవ్వడం కరెక్టేనా?
Advertisement

హీరోగా ఎంట్రీ ఇచ్చిన తోలి చిత్రం తొలివలపు అట్టర్ ప్లాప్ అవడంతో ఢీలా పడి కూర్చున్న గోపీచంద్ ని మళ్ళి లైం లైట్ లోకి తీసుకొచ్చి జయం సినిమాతో ఓవర్ నైట్ స్టార్ ని చేసాడు దర్శకుడు తేజ. అంతేకాదు ఇమ్మిడియట్ గా మహేష్ బాబు నిజం సినిమాలో పవర్ ఫుల్ విలన్ పాత్రకి కంటిన్యూ చేసి గోపీచంద్ లోని పెరఫార్మెన్స్, కెపాసిటీని, కేపబిలిటిని ప్రేక్షకులకి చూపించాడు. నెక్స్ట్ మళ్ళి గోపీచంద్ హీరోగా టర్న్ అయి ఎన్ని హిట్స్ కొట్టాడో.. ఎలా సెటిల్ అయ్యాడో మనమందరం చూసాం. అలాంటి తేజకి గోపీచంద్ హ్యాండ్ ఇవ్వడం అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశం  అయ్యింది.

తేజ ఎన్నో ఆశలు పెట్టుకుని తాను రాసుకున్న అలివేలు వెంకట రమణ కథకి హీరో గోపీచంద్ అయితే పర్ఫెక్ట్ అనుకుని గోపీచంద్ తో సినిమా చేద్దామనుకున్న టైం లో మారుతీ - యువీ క్రియేషన్స్ కాంబో ప్రాజెక్ట్ గోపీచంద్ దగ్గరకు రాగానే గోపీచంద్.. మారుతీ ప్రాజెక్ట్ కి టెంప్ట్ అయ్యి అటు షిఫ్ట్ అయ్యాడు. ఈ విషయంలో దర్శకుడు తేజ చాలా అసంతృప్తిగా ఉండడమే కాదు.. గోపీచంద్ మీద చిందులు తొక్కుతున్నట్టుగా తెలుస్తుంది. మరి గోపీచంద్ ఇలా హ్యాండ్ ఇవ్వడంతో ఇప్పుడు దర్శకుడు తేజ తన టైటిల్ కి యాప్ట్ అయ్యే హీరోని వెతుక్కోవాల్సి వచ్చింది.

Is it correct to give a hand to the director who gave the hit?:

Gopichand given shock to director teja

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement