Advertisement

రాజమౌళి రెడీ అవుతున్నాడు..

Tue 22nd Sep 2020 10:52 PM
rajamouli,rrr,ntr,ram charan,keeravani,ajay devgan,shriya  రాజమౌళి రెడీ అవుతున్నాడు..
RRR will resumes shoot from.. రాజమౌళి రెడీ అవుతున్నాడు..
Advertisement

దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరక్కిస్తున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా కనిపించనున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఐతే కరోనా కారణంగా నిలిచిపోయిన చిత్ర షూటింగ్ మళ్ళీ మొదలు కాలేదు. సినిమా చిత్రీకరణకి ప్రభుత్వం నుండి అనుమతులు వచ్చిన కొన్ని రోజులకి ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ చేద్దామని ప్లాన్ చేసినప్పటికీ వర్కౌట్ కాలేదు.

ఆ తర్వాత రాజమౌళి కుటుంబం కరోనా బారిన పడింది. ప్రస్తుతం ఫ్యామిలీ అంతా సేఫ్ గా ఉన్నారు. ప్లాస్మా దానం కూడా చేసారు. ఐతే గత కొన్ని రోజులుగా సినిమా షూటింగులు స్టార్ట్ అయ్యాయి. పెద్ద పెద్ద చిత్రాలు సైతం చిత్రీకరణ మొదలు పెట్టాయి. ఈ నేపథ్యంలో ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం రాజమౌళి, ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కి సిద్ధం అవుతున్నాడని టాక్.

అక్టోబర్ రెండవ వారం నుండి ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ రీస్టార్ట్ అవనుందట. ఈ మేరకు రాజమౌళి ప్లాన్ చేసాడని సమాచారం. మొదటగా ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్స్ షూట్ చేసి, అభిమానుల కోసం ఎన్టీఆర్ లుక్ రివీల్ చేస్తారట. అంటే అక్టోబర్ లో ఎన్టీఆర్ లుక్ బయటకి వచ్చే అవకాశం  ఉంటుంది.

RRR will resumes shoot from..:

RRR will resumes shoot from..

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement