ఆ బాలీవుడ్ చిత్రం టాక్సీవాలా రీమేక్ కాదుగా...?

విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సాంక్రిత్యాయాన్ దర్శకత్వం వహించిన  సినిమా టాక్సీవాలా బాక్సాఫీసు వద్ద పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. ఐతే ఈ సినిమా బాలీవుడ్ లో రీమేక్ అయ్యిందన్న వార్తలు జోరందుకున్నాయి. ఇషాన్ ఖత్తర్, అనన్య పాండే జంటగా నటిస్తున్న ఖాళీ పీలీ చిత్రం టాక్సీవాలా రీమేక్ గానే రూపొందిందని ప్రచారం జరిగింది.

ఖాళీ పీలీ టీజర్ రిలీజ్ చేసినప్పటి నుండి ఈ రూమర్లు బాగా ఊపందుకున్నాయి. ఖాళీ పీలీ టీజర్ లో కనిపించిన దాని ప్రకారం టాక్సీవాలాకి ఆ సినిమాకి ఎలాంటి సంబంధం లేదనిపించింది. కాకపోతే ఖాళీ పీలో కథ కూడా పూర్తిగా టాక్సీలోనే జరగబోతుందని టీజర్ ద్వారా హింట్ ఇచ్చారు. ఆ దెబ్బతో టాక్సీవాలా రీమేక్ అనే మాటలు వచ్చాయి. ఐతే తాజాగా చిత్ర దర్శకుడు మక్భూల్ ఖాన్ మాట్లాడుతూ ఖాళీ పీలీ చిత్రం ఏ చిత్రానికి రీమేక్ కాదని, తానే స్వయంగా రాసాడని చెప్పుకొచ్చాడు. ఇకనైనా టాక్సీవావా రీమేక్ అన్న మాటలు తగ్గుతాయేమో చూడాలి.

Is Taxiwala remade into Bollywood..?

Is Taxiwala remade into Bollywood..?
vijay devarakonda
taxiwala
khali peeli
ishan khatter
ananya pandey
makbhum khan
nbollywood