Advertisement

బిగ్‌బాస్: నందు క్లారిటీ ఓకే.. మరి సురేఖావాణి?

Thu 27th Aug 2020 04:28 PM
bigg boss,surekha vaani,nandu,bomma blockbuster,bb game  బిగ్‌బాస్: నందు క్లారిటీ ఓకే.. మరి సురేఖావాణి?
Bigg Boss.. Game Started బిగ్‌బాస్: నందు క్లారిటీ ఓకే.. మరి సురేఖావాణి?
Advertisement

బిగ్ బాస్ సీజన్ 4 త్వరలోనే స్టార్ మా లో ప్రసారం కాబోతుంది. ఇప్పటికే విడుదలైన నాగార్జున బిగ్ బాస్ ప్రోమోతో ఈ షో మీద మరింత ఆసక్తి బుల్లితెర ప్రేక్షకుల్లో పెరిగింది. బిగ్ బాస్‌లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్‌కి కరోనా టెస్ట్ లు చేసి హోమ్ క్వారంటైన్ లో ఉంచినట్లుగా వార్తలొస్తుంటే... షో లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ విషయంలో సోషల్ మీడియాలో చాలా పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అందులో ముఖ్యంగా సురేఖ వాణి, నటుడు నందు, రఘు మాస్టర్ -ప్రణవి జంట, అలాగే మహాతల్లి ఆమె భర్త సుశాంత్, హెచ్ఎం టివి యాంకర్ సుజాత, కరాటే కళ్యాణి, లాస్య, నోయల్, జబర్దస్త్ అవినాష్, యాంకర్ ప్రశాంతిల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే బిగ్ బాస్ సీజన్ 4 స్టార్టింగ్ డే వరకు బిగ్ బాస్ లోకి అడుగుపెట్టే కంటెస్టెంట్స్ వివరాలు బయట పెట్టరు బిగ్ బాస్ యాజమాన్యం.

కానీ ఇప్పుడు ఓ కంటెస్టెంట్ తాను బిబి లోకి వెళ్ళబోతున్నట్టుగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు. దీంతో అందరూ అవాక్కయ్యారు. ఇంతకీ ఎవరతను అనుకుంటున్నారా? సీజన్ 2 లో పాల్గొన్న సింగర్ గీత మాధురి భర్త నందు. తాజాగా నందు ఇన్స్టా లో డార్లింగ్స్ నేను బిబిలో పాల్గొంటున్నాను. అక్కడ మన రచ్చ మాములుగా ఉండదు. మరింత ఎంటరైన్మెంట్ తో మీ ముందుకు వస్తాము.. మీ సహాయం కావాలి.. మరో అప్ డేట్ తో మంగళవారం మీ ముందుకు వస్తాం అంటూ కన్ఫర్మ్ చేసాడు. తర్వాత బిబి అంటే బిగ్‌బాస్ కాదని, బొమ్మ బ్లాక్‌బస్టర్ అనే సినిమాకు సంబంధించినదని.. ఓ పోస్టర్ విడుదల చేశారు.

ఇక సురేఖావాణి కూతురు కూడా క్లారిటీ ఇవ్వకుండానే అమ్మ సురేఖ వాణి కూడా బిగ్ బాస్ లో పాల్గొనబోతున్నట్టుగా చెబుతుంది. తాజాగా సురేఖ వాణి కూతురు మాట్లాడుతూ తన తల్లి తనకి బిగ్ బాస్ కి వెళుతున్నట్టుగా తనకి చెప్పలేదని.. అంటుంది. కానీ అమ్మ బిగ్ బాస్ కి వెళ్లడం ఏమిటి అంటూ ఖండించలేదు. అలాగే వెళ్లడం లేదని చెప్పలేదు. అంటే సురేఖ వాణి బిగ్ బాస్ సీజన్ 4 లో కనిపించడం ఖాయమే.

Bigg Boss.. Game Started:

Nandu Gives Clarity about BB.. what about Surekha Vaani?

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement