‘ఆచార్య’.. ఇప్పటి వరకు ఎంత షూట్ చేశారంటే..?

Chiru Acharya Movie Latest Update

Fri 31st Jul 2020 10:45 PM
chiranjeevi,acharya movie,shooting update,koratala siva  ‘ఆచార్య’.. ఇప్పటి వరకు ఎంత షూట్ చేశారంటే..?
Chiru Acharya Movie Latest Update ‘ఆచార్య’.. ఇప్పటి వరకు ఎంత షూట్ చేశారంటే..?
Advertisement

చిరంజీవి - కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా ఆగస్ట్ నాటికీ పూర్తయ్యి చిరు పుట్టినరోజునాడు ఆచార్య ట్రైలర్ ని విడుదల చేసేద్దామనుకుంటే కరోనా లాక్‌డౌన్‌తో షూటింగ్ ఆపుకుని కూర్చుంది టీమ్. కరోనా వ్యాక్సిన్ వచ్చేవరకు ఆచార్యనే కాదు మరే ఇతర పెద్ద సినిమా సెట్స్ మీదకెళ్లే ప్రసక్తే లేదంటున్నారు. అయితే కరోనా లాక్‌డౌన్ లోనే రామ్ చరణ్ క్యారెక్టర్ ఆచార్యలో ఓ 30 నిమిషాల పాటు ఉండబోతుందని.. రామ్ చరణ్ కేరెక్టర్ కోసం ఓ హీరోయిన్ కూడా ఉంటుంది అని అంటే.. కరోనా లాక్‌డౌన్ ముగియగానే కాజల్ అగర్వాల్ డేట్స్‌తో ఆచార్య షూటింగ్ మొదలవుతుంది అని అన్నారు.

ఇక కరోనా లాక్‌డౌన్ మొదలయ్యేసరికి ఆచార్య సినిమా ఓ ముప్పైశాతం టాకీ పూర్తయ్యింది అని, అందులో మూడు ఫైట్స్ తో పాటుగా.. ఓ ఐటెం సాంగ్ కూడా పూర్తి చేసారని అంటున్నారు. ఇప్పటివరకు పూర్తయిన మూడు ఫైట్స్‌కీ రామ్ – ల‌క్ష్మ‌ణ్ మాస్ట‌ర్లు తెరకెక్కించారు. అలాగే ఆచార్య ఇంట్ర‌వెల్ బ్యాంగ్ తెర‌కెక్కిస్తున్న‌ప్పుడు.. క‌రోనా వ‌ల్ల షూటింగ్ ఆపేశారట. ఇక ఆచార్య షూటింగ్ ఎప్పుడు మొదలుపెట్టినా. కీలక సన్నివేశాలతో కాకుండా.. ఎక్కడైతే షూటింగ్ ఆపేశారో.. అంటే ఇంటర్వెల్ బ్యాంగ్ దగ్గర నుంచే షూటింగ్ మళ్లీ మొదలు పెడతారట చిత్ర బృందం.

Chiru Acharya Movie Latest Update:

30 percent takie part completed to Acharya Movie


Loading..
Loading..
Loading..
advertisement