ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Producer Vallurupalli Ramesh Son Marriage details

చాలా సింపుల్‌గా నిర్మాత తనయుడి వివాహం

Producer Vallurupalli Ramesh Son Marriage details

నిర్మాత వల్లూరుప‌ల్లి ర‌మేష్ కుమారుడు మ‌హ‌ర్షి వివాహ మ‌హోత్స‌వం

ప్ర‌ముఖ నిర్మాత వల్లూరుప‌ల్లి ర‌మేష్ బాబు కుమారుడు రాఘ‌వేంద్ర‌ మ‌హ‌ర్షి వివాహమ‌హోత్స‌వం ఈ బుధ‌వారం సాయంత్రం హైద‌రాబాద్ అవాస హోట‌ల్లో జ‌రిగింది. మ‌హ‌ర్షి- శ్రీ‌జ జంట‌ను ఆశీర్వ‌దించేందుకు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. సాంబశివ‌రావు- శ్రీ‌దేవి దంప‌తుల కుమార్తె శ్రీ‌జ. శ‌తాధిక చిత్రాల‌ హీరో శ్రీ‌కాంత్, ప్ర‌ముఖ నిర్మాత‌ జెమిని కిర‌ణ్, సురేష్ కొండేటి త‌దిత‌రులు ఈ వేడుక‌కు హాజ‌ర‌య్యారు. ప్ర‌భుత్వ‌ మార్గ‌ద‌ర్శ‌కాల కార‌ణంగా.. కొద్దిమంది బంధు మిత్రుల స‌మ‌క్షంలో ఈ వివాహ వేడుక జ‌రిగింద‌ని వ‌ల్లూరుప‌ల్లి ర‌మేష్ బాబు - గీత దంప‌తులు వెల్ల‌డించారు.

ఔను వాళ్లిద్ద‌రు ఇష్ట‌ప‌డ్డారు, గోపి గోపిక గోదావ‌రి, క‌బ‌డ్డీ క‌బ‌డ్డీ, సైలెన్స్ ప్లీజ్, పందెం స‌హా ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల్ని వ‌ల్లూరుప‌ల్లి ర‌మేష్ బాబు నిర్మించారు.

Producer Vallurupalli Ramesh Son Maharshi weds Srija

producer vallurupalli ramesh
maharshi weds srija
srikanth
gemini kiran
marriage