Advertisement

ప్రభాస్ 20 ఫస్ట్‌లుక్‌తో.. ఇరకాటంలో రాజమౌళి!

Fri 10th Jul 2020 07:51 AM
ss rajamouli,first look,prabhas 20,headace,prabhas,jr ntr,rrr movie  ప్రభాస్ 20 ఫస్ట్‌లుక్‌తో.. ఇరకాటంలో రాజమౌళి!
Prabhas 20 First Look.. Jr NTR Fans Targets SS Rajamouli ప్రభాస్ 20 ఫస్ట్‌లుక్‌తో.. ఇరకాటంలో రాజమౌళి!
Advertisement

ప్రభాస్ ఫ్యాన్స్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ లుక్ కోసం, టైటిల్ కోసం తెగ వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్ - రాధాకృష్ణ మూవీ లుక్ కోసం ఫ్యాన్స్ ఒకరకంగా కొట్టుకుంటున్నారని చెప్పవచ్చు. ‘బాహుబలి’తో ఐదేళ్లు, ‘సాహో’తో రెండేళ్లు ఫ్యాన్స్‌ని వెయిట్ చేయించిన ప్రభాస్.. ఇప్పుడు రాధాకృష్ణ మూవీతోను ఫ్యాన్స్‌తో ఆడుకుంటున్నాడు. యువీ క్రియేషన్స్ లో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా సినిమా ప్రీ లుక్ ఎప్పుడో ఇచ్చినా.. ఫస్ట్ లుక్ కానీ, టైటిల్ పోస్టర్ కానీ ఇవ్వకుండా ఆరేడు నెలలు నుండి ఊరిస్తున్నారు. మధ్యలో సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ పెద్ద యుద్ధమే చేశారు. అయితే తాజాగా అనుకోకుండా ప్రభాస్ ఫస్ట్ లుక్ జూలై 10 న అంటూ అనౌన్స్ చెయ్యడంతో ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు. అలా ప్రభాస్ ఇప్పుడు రాజమౌళిని ఎన్టీఆర్ ఫ్యాన్స్ దగ్గర అడ్డంగా ఇరికించాడు.

ఎన్టీఆర్ బర్త్‌డే రోజున ఆర్‌ఆర్‌ఆర్‌లోని కొమురం భీమ్ వీడియో ఇవ్వకుండా ఫ్యాన్స్ బాగా డిజప్పాయింట్ అయ్యేలా చేసాడు. కరోనా లాక్‌డౌన్.. అందుకే ఎన్టీఆర్ వీడియో వదల్లేకపోయామని చెప్పాడు రాజమౌళి. మరి లాక్‌డౌన్ సమయంలోనే ప్రభాస్ కొత్త సినిమా లుక్ ఎలా వదులుతున్నారు.. మీరు మాత్రం వదలకుండా మమ్మల్ని డిజప్పాయింట్ చేశారంటూ ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రాజమౌళిని టార్గెట్ చేస్తున్నారు. ప్రభాస్ లుక్ కోసం సోషల్ మీడియాలో యువీ క్రియేషన్స్ మీద ప్రభాస్ ఫ్యాన్స్ చేసిన యుద్ధాన్ని ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ లుక్ కోసం రాజమౌళిపై చేస్తున్నారు. పాపం రాజమౌళి ప్రభాస్ చేసిన ఈ పనికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ వద్ద అడ్డంగా ఇరుక్కున్నాడు. 

Prabhas 20 First Look.. Jr NTR Fans Targets SS Rajamouli:

Headace to Rajamouli with Prabhas 20 1st Look

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement