పవన్- క్రిష్ సినిమా కోసం మరో రెండు టైటిల్స్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ సినిమా అనంతరం పవన్ కళ్యాణ్, క్రిష్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే కొంతభాగం చిత్రీకరణ జరుపుకుంది. పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్లోనే భారీ బడ్జెట్ గా రూపొందుతోంది. 

అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ బందిపోటు దొంగగా కనిపించనున్నాడట. మొఘలుల కాలం నాటి కథతో రూపొందుతున్న ఈ సినిమాకి విరూపాక్ష అనే టైటిల్ పెట్టినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటికే విరూపాక్ష అనే టైటిల్ బాగా ప్రచారంలోకి వెళ్ళింది కూడా. అయితే ప్రస్తుత సమాచారం ప్రకారం ఈ సినిమాకి మరో రెండు టైటిల్స్ ని అనుకుంటున్నారట. బందిపోటు, గజదొంగ అనే రెండు టైటిల్స్ లో ఏదో ఒక టైటిల్ ని ఫిక్స్ చేయాలని భావిస్తున్నారట.

అయితే పవన్ కళ్యాన్ ఛరిష్మాకి ఆ టైటిల్స్ ఏ విధంగా సరిపోతాయనేది సందేహంగా ఉంది. అయితే ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కాబట్టి చిత్రబృందం టైటిల్స్ విషయంలో మళ్ళీ ఆలోచిస్తుందేమోనని అభిమానులు అనుకుంటున్నారు.

Pawan Kalyan movie titles are..

Pawan Krish Movie titles are..?
pawan kalyan
krish
tolywood
pspk