జబర్ధస్త్ షోని వదలని కరోనా.. టాప్ టీమ్ లోని..!

Again corona Effecton Jabardasth Comedy show

Wed 08th Jul 2020 08:58 AM
jabardasth,comedy show,corona effect,to team,corona positive,small screen  జబర్ధస్త్ షోని వదలని కరోనా.. టాప్ టీమ్ లోని..!
Again corona Effecton Jabardasth Comedy show జబర్ధస్త్ షోని వదలని కరోనా.. టాప్ టీమ్ లోని..!
Advertisement

కరోనాకి ధనిక, పేద అన్న భావం లేదు. ముసలోడా.. చంటిపిల్లాడా అనే తారతమ్యము లేదు. కరోనా మహమ్మారి ముందు ఎవ్వరైనా ఒకటే అన్నట్టుగా పరిస్థితి రోజురోజుకి దిగజారుతోంది. కరోనా కారణంగా పలు రంగాల్లో ఉపాధి కోల్పోయి అనేకమంది రోడ్డునపడ్డారు. అయినా కరోనా మహమ్మారి శాంతించడం లేదు. రోజుకి వేలల్లో జనాల్ని తనతో తీసుకుపోతుంది. కరోనా దెబ్బకి ఒకరితో మాట్లాడాలన్నా భయమే. కలిసి తినాలన్న, పడుకోవాలన్న, చెయ్యి కలపాలన్న భయంగానే ఉంది. ఇక అన్ని రంగాలకన్నా సినిమా రంగం మరీ ఘోరంగా తయారయ్యింది. ప్రభుత్వం అనుమతులిచ్చినా షూటింగ్స్ చేసుకోలేని పరిస్థితి. సినిమాల సంగతి ఎలా ఉన్న సీరియల్స్ షూటింగ్స్ మొదలయ్యాయి.. కానీ ఒక్కో రోజు ఒక్కో సీరియల్ నుండి ఒక్కో నటుడు కరోనా పాజిటివ్‌గా తేలడంతో.. మిగతా ఆర్టిస్ట్‌లకు వణుకు పుడుతుంది. టీవీ ఆర్టిస్టులకు కరోనా పాజిటివ్ రావడంతో కొన్ని సీరియల్స్ షూటింగ్స్ నిలిచిపోయాయి.

ఇక తాజాగా కరోనా సెగ టాప్ కామెడీ షో జబర్దస్త్‌ని తాకింది అనే టాక్ వినబడుతుంది. గత మూడు నెలలుగా కరోనా లాక్‌డౌన్‌తో జబర్దస్త్ షూటింగ్‌కి బ్రేకిచ్చి.. రెండు వారాల క్రితం నుండి ఫ్రెష్ ఎపిసోడ్స్‌తో మళ్ళీ క్రీజులోకొచ్చింది. గత రెండు వారాలుగా జబర్దస్త్ కామెడీ ఖతర్నాక్‌గా ఆకట్టుకుంటుంది. మళ్లీ ఈటీవీ జబర్దస్త్ ఎపిసోడ్స్‌తో టీఆర్పీ పరంగా టాప్‌లోకి దూసుకెళ్లడం ఖాయమనుకునే లోపు హైపర్ ఆది టీం లోని ఓ సభ్యుడు కరోనా బారిన పడడంతో.. హైపర్ ఆది టీం మొత్తం కరోనా టెస్టులు చేయించుకున్నారట. అంతేకాకుండా టీం లీడర్స్ అంతా కరోనా టెస్ట్ లు చేయించుకున్నారని.. వాళ్ళంతా స్వీయ నిర్బంధంలోకి వెళ్లారని తెలుస్తుంది. అయితే జబర్దస్త్ టీంలోని కొంతమందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లుగా తేలితే మళ్లీ జబర్దస్త్ షూటింగ్‌ని ఆపేస్తారట. అయితే కామెడీ ప్రియులు కంగారు పడక్కర్లేదని.. ఇప్పటికే జబర్దస్త్ నాలుగైదు ఎపిసోడ్స్ షూటింగ్ జరగడం వలన మరో రెండు వారాలకి వచ్చిన ఇబ్బంది ఏం లేదని మల్లెమాల టీం చెబుతున్న మాట. 

Again corona Effecton Jabardasth Comedy show:

Corona positive case detected in Jabardasth top team member


Loading..
Loading..
Loading..
advertisement