ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Keerthy Sureshs Miss India will be Streaming on..?

కీర్తి సురేష్ మిస్ ఇండియా కూడా అదే బాట పడుతుందా..?

మహానటి ద్వారా బ్లాక్ బస్టర్ అందుకుని దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్, ప్రస్తుతం చాలా బిజీగా ఉంది. వరుసగా సినిమాలని ఒప్పుకుంటూ  కెరీర్ పరంగా ఫుల్ ఫామ్ లో ఉంది. అయితే తాజాగా కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన పెంగ్విన్ చిత్రం థియేటర్ రిలీజ్ లేకుండానే డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అయింది. బిడ్డని పోగుట్టుకున్న తల్లి, ఆ బిడ్డని వెతుక్కోవడంలో పడే కష్టాన్ని చూపించడంలో కీర్తి సురేష్ చాలా అద్భుతంగా నటించింది.

అయితే ఈ ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది. తాజా సమాచారం ప్రకారం కీర్తి సురేష్ నటించిన మిస్ ఇండియా చిత్రం కూడా ఓటీటీలో రిలీజ్ అవనుందని అంటున్నారు. మహేష్ కోనేరు నిర్మాతగా నరేంద్ర నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్, నదియా, నవీన్ చంద్ర, కమల్ కామరాజు, పూజిత పొన్నాడ తదితరులు నటించారు.

మిస్ ఇండియాలో కీర్తి సురేష్ చాలా గెటప్స్ లో కనిపించనుందట. వివిధ కాలాలకి చెందిన వివిధ రకాల గెటప్పుల్లో కనిపించి ఆశ్చర్యపరుస్తుందట. అయితే చిత్ర నిర్మాత మహేష్ కోనేరు ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయడానికే మొగ్గుచూపుతున్నాడని టాక్. మరి నిర్మాత కోరినట్టు మిస్ ఇండియా చిత్రం డిజిటల్ ప్రీమియర్ అవుతుందో లేదో చూడాలి.

Keerthy Sureshs Miss India will be Streaming on..?

Keerthy Sureshs Miss India will be Streaming on..?
keerthy suresh
miss india
narendra nath
mahesh koneru