ఓ బేబీ సంవత్సరం కంప్లీట్ చేసుకుంది..

ఏ మాయ చేశావే సినిమాతో హీరోయిన్ గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన సమంత అందరి మనసులని మాయ చేసింది. నాగచైతన్య హీరోగా నటించిన ఈ సినిమాతో సమంత స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ అవకాశాలు తెచ్చుకుంటూనే ఉంది. తన మొదటి హీరో నాగచైతన్యని పెళ్ళి చేసుకుని తెలుగింటి కోడలిగా మారిన తర్వాత ఆమె ఎంచుకునే కథల్లో చాలా మార్పు వచ్చింది.

అయితే గత ఏడాది సమంత నటించిన ఓ బేబీ చిత్రం బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. సమంత ప్రధాన పాత్రలో రూపొందిన ఈ చిత్రాన్ని నందినీ రెడ్డి దర్శకత్వం వహించింది. కొరియన్ మూవీ మిస్ గ్రానీ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించాయి. అయితే ఈ సినిమా రిలీజై నేటితో సంవత్సరం పూర్తయింది. సరిగ్గా ఏడాది క్రితం రిలీజైన ఓ బేబీ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. 

60ఏళ్ళ వృద్ధురాలు ఫోటోదిగగానే 24ఏళ్ళ యువతిగా మారిపోవడం అనే వినూత్నమైన అంశంతో రూపొందిన ఈ చిత్రంలో సమంత నటన అందర్నీ ఆకర్షించింది. అందుకే ఈ సినిమా సమంత కెరీర్లో ప్రత్యేకంగా నిలిచింది. ఈ సినిమాలో సమంతతో పాటు సీనియర్ నటి లక్ష్మీ, రాజేంద్రప్రసాద్, నాగశౌర్య, రావు రమేష్ ప్రధాన పాత్రల్లో కనిపించారు.

Oh baby completed one year..

Oh baby completed one year..
samantha
oh baby
rao ramesh
nagashourya
nandini reddy